Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరో!

భారత స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాకు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ క్షమాపణలు చెప్పిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో రామ్‌చరణ్ నోరు జారడం, ఆ తర్వాత తప్పు తెలుసుకుని వెంటనే స్పందించడం అభిమానుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది.

ఈవెంట్లో అసలేం జరిగింది?
రామ్‌చరణ్ నటించిన తాజా సినిమా 'పెద్ది'ప్రమోషన్లలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు హాజరయ్యారు. స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో రామ్‌చరణ్ టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన తెచ్చాడు. అయితే ఆ ఉత్సాహంలో బుమ్రాను క్రికెటర్ అనబోయి పొరపాటున ఫుట్‌బాల్ ప్లేయర్ అని అన్నాడు. దీంతో మిమ్మల్ని చూసి ప్రపంచం గర్విస్తుందని ప్రశంసల వర్షం కురిపించాడు. వేలాది మంది జనాల మధ్య జరిగిన ఈ చిన్న పొరపాటు సోషల్ మీడియాలో వెంటనే చర్చనీయాంశమైంది.

Ram Charan Apologizes to Cricketer Jasprit Bumrah Over Football Player Slip at Peddi Event Details

ఎక్స్ వేదికగా రామ్‌చరణ్ క్షమాపణలు
పెద్ది ఈవెంట్ ముగిసిన వెంటనే తన పొరపాటును గ్రహించిన రామ్‌చరణ్ ఏ మాత్రం సంకోచించకుండా సోషల్ మీడియా వేదికగా జస్ప్రీత్ బుమ్రాకు క్షమాపణలు చెప్పాడు. తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా బుమ్రాను ట్యాగ్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "నేను కొన్నిసార్లు నిజంగానే పేర్లు, వివరాలు మర్చిపోతుంటాను. భోపాల్ ఈవెంట్‌లో అంత పెద్ద క్రౌడ్ మధ్యలో తెలియకుండానే ఈ పొరపాటు జరిగిపోయింది. జస్‌ప్రీత్ బుమ్రా గారూ.. మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను మీ ఆటను అమితంగా ఇష్టపడే మీ పెద్ద అభిమానిని. మీ అద్భుతమైన ప్రదర్శనతో మీరు ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తున్నారు" అని రామ్ చరణ్ రాసుకొచ్చాడు.

అభిమానుల ప్రశంసలు
సాధారణంగా ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నవారు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను పెద్దగా పట్టించుకోరు. కానీ రామ్‌చరణ్ మాత్రం తన తప్పును వెంటనే ఒప్పుకుని, బుమ్రాకు గౌరవం ఇస్తూ క్షమాపణలు చెప్పడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రామ్‌చరణ్‌కు గర్వం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ అటు మెగా అభిమానులు, ఇటు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Story first published: Sunday, May 24, 2026, 8:26 [IST]
Other articles published on May 24, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+