Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రంజీ ఫైనల్ చరిత్రలోనే రెండో వాడిగా గుర్బానీ రికార్డు

Rajneesh Gurbani becomes 2nd bowler to take hat-trick in Ranji final

హైదరాబాద్: ఒక్కోసారి మ్యాచ్‌లలో ఒక్కరే కీలకంగా కనిపిస్తారు. ఆట మొత్తం తన మీదే వేసుకుని నడిపిస్తారు. సరిగ్గా అలాగే గుర్బానీ శనివారం జరిగిన రంజీ ఫైనల్‌లో ఢిల్లీని తన బంతితో చుట్టేవాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఒక్కడే ఆరు వికెట్లను తీశాడు. అది హ్యాట్రిక్ వికెట్లు తీసి ఔరా అనిపించాడు.

వరుసగా మూడు ఓవర్లలో మూడు వికెట్లను తీసి హ్యాట్రిక్‌ వికెట్లను సాధించాడు గుర్భానీ. శనివారం జరగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 100 ఓవర్‌ ఐదో బంతికి వికాశ్‌ మిశ్రాను ఔట్ చేశాడు. తరువాత బంతికి నవదీప్‌ షైనీని బోల్తా కొట్టించాడు. ఇక 102 ఓవర్‌ తొలి బంతికి ధ్రువ్‌ షోరేను అవుట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు.

మొత్తంగా ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌కు ఊపిరాడకుండా చేసి ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఫలితంగా ఢిల్లీ తన తొలి ఇన్నింగ్స్‌లో 295 పరుగులకు ఆలౌటైంది. గుర్బానీ ఆరు వికెట్లకు జతగా ఆదిత్య థాకరే రెండు వికెట్లు సాధించగా, సిద్దేశ్‌ నెరాల్‌, అక్షయ్‌ వాఖారేలకు తలో వికెట్‌ తీశారు.

అంతకముందు కర్ణాటకతో ..
ప్రధానంగా గుర్బానీ తన పేస్‌తో ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తున్నాడు. అంతకముందు కర్ణాటకతో జరిగిన సెమీ ఫైనల్లో గుర్బానీ 12 వికెట్లతో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన గుర్బానీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో మెరిశాడు. దాంతో విదర్బ ఫైనల్‌కు చేరి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

రంజీ చరిత్రలోనే తొలిసారి.:
విదర్భ రంజీ చరిత్రలోనే తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. అంచనాల మించి రాణించిన విదర్భ ఢిల్లీ జట్టును హడలెత్తిస్తోంది. ఒకవేళ రంజీ టైటిల్‌ గెలిస్తే మాత్రం ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ సాధించిన జట్టుగా అరుదైన ఘనతను విదర్బ సొంతం చేసుకుంటుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 30, 2017, 14:19 [IST]
Other articles published on Dec 30, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+