For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దక్షిణాఫ్రికా సిరీస్‌లో కోహ్లీ తానేంటో చూపిస్తాడు'

Rajkumar Sharma says Virat Kohli will show what he is capable of in ODIs vs South Africa

ముంబై: త్వరలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుంజుకుంటాడని అతని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌ పర్యటనలో పూర్తిగా విఫలమైన కోహ్లీ తదుపరి దక్షిణాఫ్రికా సిరీస్‌లో తానేంటో చూపిస్తాడన్నారు. ప్రతీ ఆటగాడూ కెరీర్‌లో ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొంటాడని, ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.

ఆ సిరీస్‌లో తానేంటో చూపిస్తాడు:

ఆ సిరీస్‌లో తానేంటో చూపిస్తాడు:

డీవై పాటిల్‌ టీ20 కప్‌ సందర్భంగా రాజ్‌కుమార్‌ శర్మ ముంబై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ప్రతీ ఆటగాడూ కెరీర్‌లో ఇలాంటి సంధి దశను ఎదుర్కొంటాడు. ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. టీమిండియా కెప్టెన్‌ విరాట్ అత్యుత్తమ ఆటగాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకున్నాడు. త్వరలోనే పుంజుకుంటాడు. కోహ్లీ తదుపరి దక్షిణాఫ్రికా సిరీస్‌లో తానేంటో చూపిస్తాడు' అని అన్నారు.

 కివీస్ బౌలర్లు ప్రణాళికతో ఆడారు:

కివీస్ బౌలర్లు ప్రణాళికతో ఆడారు:

'నేను కోహ్లీతో తరచూ మాట్లాడుతుంటా. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ చర్చిస్తా. కోహ్లీ బాగా ఆడుతున్నా అనూహ్యంగా పెవిలియన్ చేరుతున్నాడు. ఈ క్రెడిట్ ముమ్మాటికీ కివీస్‌ బౌలర్లదే. వారిని మెచ్చుకోని తీరాల్సిందే. కివీస్ బౌలర్లు సరైన ప్రణాళికతో ఆడారు. కోహ్లీ ఒక్కడినే కాకుండా భారత బ్యాట్స్‌మెన్‌ అందర్నీ ఎలా ఎదుర్కోవాలో ముందుగానే సిద్ధమయ్యారు' అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

 కోహ్లీ పుంజుకుంటాడు:

కోహ్లీ పుంజుకుంటాడు:

'రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన విరాట్ కోహ్లీ స్వింగ్‌ బౌలింగ్‌ ఆడలేడనడం సరికాదు. ఇదో తాత్కాలిక సందర్భం మాత్రమే. త్వరలోనే కోహ్లీ పుంజుకుంటాడు' అని రాజ్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో టెస్టులో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ ఔటైన సందర్భంలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై కూడా ఆయన స్పందించారు. 'దూకుడు తనం, దుష్ప్రవర్తన మధ్య చిన్న తేడా ఉంటుంది. ఆ తేడా కోహ్లీకి తెలుసు. ఆ గీతెప్పుడూ విరాట్ దాటడు. దూకుడు తనమే కోహ్లీ బాగా ఆడటానికి ఉపకరిస్తుంది' అని రాజ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.

ఇంటాబయటా తీవ్ర విమర్శలు:

ఇంటాబయటా తీవ్ర విమర్శలు:

కివీస్ పర్యటన మొత్తంలో విరాట్ కోహ్లీ చేసింది 218 పరుగులే. టెస్టుల్లో మరీ దారుణంగా 9.50 సగటుతో 38 పరుగులే చేశాడు. రెండు టెస్టుల్లో కోహ్లీ వరుసగా 2, 19, 3, 14 పరుగులు చేశాడు. తొలి వన్డేలో మాత్రమే అర్ధ శతకంతో రాణించాడు. ఆపై మెరుపులు లేవు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టెస్టు సిరీస్‌ను కోల్పోయి ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Story first published: Tuesday, March 3, 2020, 11:28 [IST]
Other articles published on Mar 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+