రాజ్‌కోట్ టెస్టు: గత పదేళ్లలో పుజారా-విజయ్‌లదే రికార్డు
రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు మురళీ విజయ్, ఛటేశ్వర పూజారాలు గత పదేళ్లలో అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డు సృష్టంచారు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో వీరిద్దరూ వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 209 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌లు పుజారా, మురళీ విజయ్‌లు సెంచరీలతో కదం తొక్కారు. తొలి టెస్టులో వీరిద్దరూ రాణించడంతో గత పదేళ్ల కాలంలో 2000 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా పుజారా-మురళీ విజయ్‌లు అవతరించారు. 65.03 యావరేజితో వీరిద్దరి జోడి 32 ఇన్నింగ్స్‌లాడి 2,080 పరుగులు సాధించారు.
తొలి టెస్టులో పుజారా, మురళీ విజయ్‌లు సెంచరీలతో కదం తొక్కారు. అద్భుతమైన టెక్నిక్‌తో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడే పుజారా తొలి సారి రాజ్ కోట్ టెస్టులో వేగంగా ఆడి 169 బంతుల్లో 59.17 స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ సాధించాడు. 169 బంతుల్లో సెంచరీ సాధించిన పుజారా మరో భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్న క్రమంలో 124 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
పుజారాకు కెరీర్‌లో ఇది 9వ సెంచరీ కాగా ఇంగ్లాండ్‌పై మూడోది కావడం విశేషం. ఇక 260 బంతులను ఎదుర్కొన్న ఓపెనర్ మురళీ విజయ్ 8 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మురళీ విజయ్‌కు ఇది 7వ సెంచరీ. బంగ్లాదేశ్‌పై గతేడాది సెంచరీ సాధించిన తర్వాత మళ్లీ రాజ్ కోట్ టెస్టులో విజయ్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌పై విజయ్‌కిది తొలి సెంచరీ.
గత పదేళ్లుగా టెస్టుల్లో అత్యుత్తమ జోడీలివే:

పుజారా-విజయ్
లి టెస్టులో వీరిద్దరూ రాణించడంతో గత పదేళ్ల కాలంలో 2000 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా పుజారా-మురళీ విజయ్‌లు అవతరించారు. 65.03 యావరేజితో వీరిద్దరి జోడి 32 ఇన్నింగ్స్‌లాడి 2,080 పరుగులు సాధించారు.
పుజారా-విజయ్: 2080 పరుగులు; 32 ఇనింగ్స్‌లు; అత్యధిక స్కోరు 370; యావరేజి 66.58.

కోహ్లీ-రహానే
పుజారా-విజయ్‌ల తర్వాత రెండో స్ధానంలో విరాట్ కోహ్లీ-రహానేల జోడి ఉంది. 25 ఇన్నింగ్స్ లాడిన వీరిద్దరూ 1579 పరుగులు చేశారు.
కోహ్లీ-రహానే: 25 ఇన్నింగ్స్‌లు, 1579 పరుగులు, అత్యధిక స్కోరు 365, యావరేజి 63.16

ధోని-వీవీఎస్ లక్ష్మణ్
మూడో స్ధానంలో ధోని-వీవీఎస్ లక్ష్మణ్ జోడి ఉంది. 25 ఇన్నింగ్స్‌లు ఆడిన వీరిద్దరూ 1,214 పరుగులు సాధించారు.
ధోని-లక్ష్మణ్: 25 ఇన్నింగ్స్‌లు, 1214 పరుగులు, అత్యధిక స్కోరు 259*, యావరేజి 55.18

రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్
టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో రాహుల్ ద్రవిడ్-వీవీఎస్ లక్ష్మణ్‌లు జోడీ అత్యుత్తమ జోడీ. 28 ఇన్నింగ్స్ లాడిన వీరిద్దరూ 1486 పరుగులు సాధించి నాల్గవ స్ధానంలో ఉన్నారు.
ద్రవిడ్-లక్ష్మణ్: 28 ఇన్నింగ్స్‌లు, 1486 పరుగులు, అత్యధిక స్కోరు 268, యావరేజి 55.03

గంభీర్-ద్రవిడ్
2065 పరుగులు చేసిన గంభీర్-ద్రవిడ్‌ల జోడీ ఐదో స్ధానంలో నిలిచింది.
ద్రవిడ్-గంబీర్: 39 ఇన్నింగ్స్‌లు, 2065 పరుగులు, అత్యధిక స్కోరు 314, యావరేజి 54.34

గంభీర్-సెహ్వాగ్
గంభీర్-సెహ్వాగ్ జోడి 3410 పరుగులు చేసింది. వీరిద్దరి జోడి అత్యధిక పరుగులు సాధించిన జోడీగా గుర్తింపు పొందింది.
గంభీర్-సెహ్వాగ్: 68 ఇన్నింగ్స్‌లు, 3410 పరుగులు, అత్యధిక స్కోరు 233, యావరేజి 51.66.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications