For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ విక్టరీకి కోహ్లీ అడ్డు: డ్రాగా ముగిసిన తొలి టెస్టు

By Nageshwara Rao

రాజ్‌కోట్: భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రా గా ముగిసింది. 114/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం చివరి రోజున రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్ ను 260/3 వద్ద డిక్లేర్ చేసింది. అంతక ముందు తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లాండ్‌కు 49 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే.

Kohli stands firm, India earn hard-fought draw versus England


దీంతో మొత్తంగా భారత్‌కు 310 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో భారీ భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్ గంభీర్‌ రెండో ఇన్నింగ్స్‌లో కూడా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

ఆ తరుణంలో మురళీ విజయ్‌తో జత కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 47 ఉండగా 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ బౌలింగ్‌లో పుజారా ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికి విజయ్(31), అజింక్యా రహానే(1)లు పెవిలియన్‌కు చేరారు.

Kohli stands firm, India earn hard-fought draw versus England

దాంతో 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లి- అశ్విన్‌ల జోడి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో అశ్విన్(32), సాహా(9)లు 14 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరడంతో మరొకసారి భారత్ తడబడింది.

ఫోటోలు: Cricket - England Tour Of India 2016-17

ఈ సమయంలో కోహ్లీ, జడేజా ద్వయం మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు వికెట్లు పడుతున్నా విరాట్ కోహ్లి మాత్రం అత్యంత నిలకడను ప్రదర్శించాడు. దీంతో 98 బంతులను ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 5 ఫోర్లుతో నాటౌట్‌గా నిలవగా, జడేజా(32) పరుగులతో ఉన్నాడు.

దీంతో ఆట ముగిసేసమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ రషీద్‌ 3 వికెట్లు తీసుకోగా వోక్స్‌, అన్సారీ, అలీ తలో వికెట్ తీసుకున్నారు. రాజ్ కోట్ టెస్టులో మొత్తం 6 సెంచరీలు నమోదు అయ్యాయి. ఇంగ్లాండ్ ఆటగాళ్లు రూట్, మోయిన్ అలీ, స్టోక్స్, కుక్‌లు సెంచరీలు చేయగా భారత ఆటగాళ్లు పుజారా, మురళీ విజయ్‌లు సెంచరీలు సాధించారు.

అదనంగా 3.3 ఓవర్లు
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఓవర్లు ముగిసినప్పటికీ ఆటను కొనసాగించారు. ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు వేయాల్సిన ఓవర్లను నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించడంతో అంఫైర్లు అదనపు ఓవర్లను వేసేందుకు అవకాశం ఇచ్చారు. నిజానికి 49 ఓవర్లతో మ్యాచ్ ముగియాల్సి ఉండగా అందనంగా 3.3 ఓవర్ల పాటు బౌలింగ్ వేశారు. మొత్తం 52.3 ఓవర్లకు టీమిండియా 6 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. ఈ సమయానికి కోహ్లీ 49, జడేజా 32 పరుగుల వద్ద నౌటౌట్‌గా నిలిచారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.


ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 537
భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 488
ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ : 260/3 డిక్లేర్
భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 172/6(52.3 ఓవర్లలో)
మ్యాచ్ ఫలితం: డ్రాగా ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+