కోహ్లీకి తొలి పరీక్ష: రెండో రోజు నమోదైన రికార్డులివే
రాజ్‌కోట్: రాజ్‌కోట్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలి పరీక్షలాగా కనిపిస్తోంది. 2014లో మహేంద్ర సింగ్ ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాక అటు విదేశాల్లోనూ, ఇటు స్వదేశంలోనూ కోహ్లికి ఎదురులేకుండా తిరుగులేదు.
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక పర్యటనలో మొదట ఓటమి ఎదురైనప్పటికీ, ఆ తర్వాత భారత జట్టు పుంజుకుని లంకపై టెస్టు సిరీస్ గెలిచింది. ఆ తర్వాత వెస్టిండిస్ పర్యనటలో భారత్ జట్టుకు విజయఢంకా మోగించింది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
అయితే ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా స్వదేశంలోని రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ ఆసోసియేషన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు చేసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టడం చాలా ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. రాజ్‌కోట్ టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కునేలా కనిపిస్తోంది.

భారత గడ్డపై మూడో అత్యధిక స్కోరు
* రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు చేసిన 537 పరుగులు భారత గడ్డపై మూడో అత్యధిక స్కోరు. 1985లో 652 పరుగులు, 1964లో 559 పరుగులు చేసింది.
* అలీ, బెన్ స్టోక్స్ భారత్‌పై సెంచరీ చేయడం తొలిసారి. మొత్తంగా వాళ్లిద్దరికీ కెరీర్లో ఇది నాలుగో సెంచరీ.
* స్టోక్స్ ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌పై ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
* వందో టెస్టు ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్ కెరీర్లో తొలిసారిగా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

భారత బ్యాట్స్‌మెన్లకు కఠిన పరీక్ష
భారత్‌తో జరుగుతున్న మొదటిటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 159.3 ఓవర్లలో 537 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. తొలి రోజు లభించిన అద్భుత ఆరంభాన్ని ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరుని సాధించి భారత బ్యాట్స్‌మెన్లకు కఠిన పరీక్ష పెట్టారు. ముఖ్యంగా భారత బౌలర్ల ఓపికను పరీక్షించారు.

39 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసిన భారత్
63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ జట్టుకు దీటుగా బదులిస్తోంది. భారత్ 39 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. గౌతం గంభీర్ 29 వ్యక్తిగత పరుగుల వద్ద బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.

537 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్
బుధవారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలిరోజు జో రూట్(124) సెంచరీ చేశాడు. ఆ తర్వాత 311/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కొద్దిసేపటికే మొయిన్ అలీ(117) సెంచరీ సాధించగా ఆ తరువాత మిడిల్ ఆర్డర్ ఆటగాడు బెన్ స్టోక్స్(128) శతకాలతో చెలరేగారు. స్టోక్స్ టెయిలెండర్లు బెయిర్ స్టో(46), అన్సారీ(32)తో స్కోరు బోర్డుకు మరిన్ని పరుగులు జతచేయడంతో ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌లో 159.3 ఓవర్లలో 537 పరుగులకు ఆలౌటైంది. జడేజా మూడు వికెట్లు తీసుకోగా షమీ, యాదవ్, అశ్విన్ తలో రెండు వికెట్లు తీసుకోగా, మిశ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications