IND vs AUS 2nd ODI: భారత్‌లో మొదటి పైకప్పు స్టేడియంగా రాజ్‌కోట్ స్టేడియం!

హైదరాబాద్: క్రికెట్‌కు పుట్టినిల్లు లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ప్రతీది ప్రత్యేకమే. అక్కడి మీడియా బాక్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అచ్చం అలాంటి మీడియా బాక్సే ఇండియాలో ఓ స్టేడియంలో ఉంది. ఆ స్టేడియమే రాజ్‌కోట్ స్టేడియం. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే రెండో టీ20కి ఈ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజ్‌కోట్ స్టేడియానికి కొత్త సొగసులు అద్దేందుకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా రెండో వన్డేకు ఆతిథ్యమిస్తోన్న రాజ్‌కోట్ స్టేడియానికి పైకప్పుతో నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఫలితంగా దేశంలోని మొట్టమొదటి పైకప్పు ఉన్న స్టేడియంగా రాజ్‌కోట్ స్టేడియం నిలవనుంది.

జయదేవ్ షా స్వయంగా
ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సీఏ) ప్రెసిడెంట్ జయదేవ్ షా స్వయంగా వెల్లడించారు. రెండో వన్డేకి ముందు ఆయన మిడ్ డే పత్రికతో మాట్లాడుతూ "ఇక్కడ రుతుపవనాలు అనూహ్యమైనవి. కాబట్టి దేశవాళీ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ ఇప్పటికే చాలా మ్యాచ్‌లు రద్దయ్యాయి. కాబట్టి, మేము వివిధ రకాల పైకప్పులను పరిశీలించాం" అని అన్నారు.

వింబుల్డన్ స్టేడియం యొక్క పైకప్పు మాదిరి
"ఒకటి ముడుచుకునేది [వింబుల్డన్ స్టేడియం యొక్క పైకప్పు] మరొకటి శాశ్వత పైకప్పు, ఇది గోపురం లాగా ఉంటుంది. రెండింటి సాధ్యాసాధ్యాలపై మేము కృషి చేస్తున్నాం. దాని కోసమే మనం పైకప్పును కోరుకుంటున్నామని లేదా ఇతరులకు భిన్నంగా ఉండాలని కాదు. ఖర్చు ఎక్కువ కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయం" అని జయదేవ్ వెల్లడించారు.

అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని
"స్టేడియం పైకప్పు నిర్మాణాన్ని సాధ్యమయ్యే పెట్టుబడిగా మార్చేందుకు గాను ఇక్కడ గరిష్ట సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడాన్ని కూడా మేము పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఫ్లడ్ లైట్ల వంటి వివిధ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక ఫ్రెంచ్ సంస్థతో దీనిపై మేము చర్చలు జరుపుతున్నాం" అని చెప్పుకొచ్చాడు.

మరో 17 ఎకరాల కొత్త స్థలాన్ని
జయదేవ్ షా మరెవరో కాదు మాజీ సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ కెప్టెన్ షా. ప్రస్తుత స్టేడియం ప్రక్కనే ఉన్న మరో 17 ఎకరాల కొత్త స్థలాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. "మేము అక్కడ కొత్త స్టేడియం నిర్మించాలని యోచిస్తున్నాం. ఇది 15,000 నుండి 20,000 వరకు సామర్థ్యం కలిగిన బహుళార్ధసాధక స్టేడియం అవుతుంది" అని అన్నారు.

కొత్తగా నిర్మించే స్టేడియంలో పైకప్పు
"కొందరు కొత్తగా నిర్మించే స్టేడియంలో పైకప్పు ఉండాలని సూచిస్తున్నారు, మరికొందరు ప్రస్తుతం ఉన్న స్టేడియంలో పైకప్పు ఉండాలని భావిస్తున్నారు. దీంతో రెండు స్టేడియాలకు అయ్యే ఖర్చుపై మేము సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం. తొలుత 25 ప్రాక్టీస్ పిచ్‌లు ఉన్న పైకప్పు స్టేడియాన్ని నిర్మించి చూస్తాం" అని జయదేవ్ షా తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications