
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఫ్యాన్స్‌కు సూపర్ సీన్ కనిపించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు తెగ ఎదురు చూశారు. ఈ క్రమంలో దీన్ని చూసేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా స్టేడియానికి వచ్చారు. ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలేతో కలిసి రజినీకాంత్ ఈ మ్యాచ్ చూస్తూ కనిపించాడు.
వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఎంసీఏ షేర్ చేసింది. దీనికి 'తలైవా ఇన్ ది హౌస్. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమోల్ కాలే మాట్లాడుకుంటూ.. వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే చూస్తున్నారు' అని క్యాప్షన్ తగిలించింది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. తర్వాత మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)చెప్పాడు. పాండ్యా నిర్ణయం మంచిదే అని నిరూపించిన మహమ్మద్ సిరాజ్.. రెండో ఓవర్లోనే కీలకమైన ట్రావిస్ హెడ్ (5) వికెట్ తీశాడు.
ఆ తర్వాత కూడా ఆసీస్ వికెట్ల పతనం కొనసాగింది. పాండ్యా బౌలింగ్‌లో స్మిత్ అవుటయ్యాడు. అయితే అద్భుతమైన టచ్‌లో కనిపించిన మిచెల్ మార్ష్ (81)ను జడేజా అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (21), కామెరూన్ గ్రీన్ (12) ముగ్గురూ కూడా పెద్దగా రాణించలేదు. మహమ్మద్ షమీ, జడేజా, కుల్దీప్ కూడా చక్కగా బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ మినహా మిగతా ఎవరూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు.