
ఆదిలోనే బట్లర్ ఔటయినా
ఛేదనలో రాజస్థాన్‌కు తొలి ఓవర్లో తొలి రెండు బంతులు ఫోర్లు బాది యశస్వి జైశ్వాల్ మంచి మూమెంటమ్ ఇచ్చాడు. కానీ రెండో ఓవర్లో సిమర్జీత్ సింగ్ బౌలింగ్‌లో ప్రమాదకర బట్లర్ (2)ఔటవ్వడంతో రాజస్థాన్‌కు గట్టిదెబ్బే తగలింది. అయినప్పటికీ యశస్వి జైశ్వాల్ మాత్రం అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. కెప్టెన్ శాంసన్ కూడా అతనికి జత కలవడంతో రన్ రేట్ మెయింటెన్ చేయగలిగారు. ఈ క్రమంలో వీరిద్దరి జోడీ 50పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ జోడీని తొమ్మిదో ఓవర్లో సాంట్నార్ విడదీశాడు. శాంసన్‌ను (15పరుగులు 20బంతుల్లో) కాట్ అండ్ బౌల్డ్‌గా ఔట్ చేశాడు. ఆ తర్వాత 12ఓవర్లో పడిక్కల్ (3)ను మొయిన్ అలీ ఔట్ చేశాడు.

అశ్విన్ వీరోచిత పోరాటానికి తలవంచిన చెన్నై
ఇక మిడిలార్డర్లో దిగిన అశ్విన్ బాధ్యతాయుతంగా ఆడాడు. 14వ ఓవర్లో తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జైశ్వాల్.. 15వ ఓవర్లో సోలాంకి బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు. తర్వాత క్యాచ్ ఔటయ్యాడు. ఇక చివరి 5ఓవర్లో 47పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొనగా.. 17వ ఓవర్లో సొలాంకి ప్రమాదకర హెట్ మయర్ (6)ను క్యాచ్ అవుట్ చేశాడు. ఇక రియాన్ పరాగ్‌తో కలిసి అశ్విన్ మాత్రం వీరోచితంగా పోరాడాడు. ఆ ఓవర్ చివరి బంతికి సిక్స్ బాదిన అశ్విన్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ పోరాటానికి చివరి ఓవర్లో ఆర్ఆర్ కేవలం 7పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక చివరి ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్‌ను అశ్విన్ ఆర్ఆర్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఇక మతీషా పతిరన వైడ్ వేయడంతో ఆర్ఆర్ మరో రెండు బంతులు ఉండగానే గెలిచింది. ఇక ఈ విజయంతో టాప్ 2పొజిషన్‌కు చేరుకున్న రాజస్థాన్ క్వాలిఫయర్ 1లో గుజరాత్ తో తలపడనుంది.

అంతకుముందు చెలరేగిన మొయిన్ అలీ
మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈ ఐపీఎల్ 2022 సీజన్లో తన చిట్టచివరి మ్యాచ్‌లో తలపడగా.. టాస్ గెలిచిన ధోనీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్లు కోల్పోయి 150పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్‌కు 151పరుగుల టార్గెట్ విధించింది. చెన్నై బ్యాటర్లలో మొయిన్ అలీ (93పరుగులు 57బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సర్లు) వీరవిహారం చేశాడు. కానీ మిగతా బ్యాట్స్ మెన్ నుంచి అంతగా సపోర్ట్ లేకపోవడంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, అశ్విన్ తలా ఒక వికెట్ తీయగా, మెక్ కాయ్, చాహల్ తలా రెండు వికెట్లు తీశారు.