న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపెనర్ల జోరు.. రాజస్తాన్‌పై కోల్‌కతా విజయం

IPL 2019 : Kolkata Knight Riders Defeat Rajasthan Royals By 8 Wickets || Oneindia Telugu
Rajasthan vs Kolkata: Kolkata won by 8 wkts

ఐపీఎల్‌లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 140 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 13.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది.

శుభారంభం అదిరింది:

శుభారంభం అదిరింది:

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు క్రిస్‌లిన్‌, సునీల్ నరైన్ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి పోటాపోటీగా బౌండరీలు, సిక్సులు బాదడంతో కోల్‌కతా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడి తొలి వికెట్ కు 91 పరుగులు జోడించారు. అయితే శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 9వ ఓవర్‌లో సునీల్‌ నరైన్‌ 47 (25 బంతుల్లో 6x4,3x6) స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

క్రిస్‌లిన్‌ అర్ధసెంచరీ:

క్రిస్‌లిన్‌ అర్ధసెంచరీ:

నరైన్‌ అవుట్ అయినా.. క్రిస్‌లిన్‌ 50 (32 బంతుల్లో 6x4, 3x6) అర్ధశతకం చేసాడు. అనంతరం శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 11వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మిధున్‌కి చిక్కాడు. ఆ తర్వాత రాబిన్‌ ఉతప్ప (26), శుభ్‌మన్‌గిల్‌ (6) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి కోల్‌కతాకు విజయాన్ని అందించారు. రాజస్తాన్‌ బౌలర్ శ్రేయస్‌ గోపాల్‌ 2 వికెట్లు సాధించాడు.

ఆదుకున్న బట్లర్‌:

ఆదుకున్న బట్లర్‌:

అంతకుముందు టాస్ ఓడి మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్‌, ఓపెనర్ అజింక్య రహానే (5) తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ జాస్‌ బట్లర్‌ (37, 34 బంతుల్లో 5x4, 1x6), స్టీవ్ స్మిత్‌తో కలిసి జట్టును ఆదుకున్నాడు. బట్లర్‌ ఔటయ్యాక.. స్మిత్ ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు.

స్మిత్‌ అర్ధ శతకం:

స్మిత్‌ అర్ధ శతకం:

అయితే మొదటి బంతి నుంచి తడబడుతున్న రాహుల్ త్రిపాఠి (5) పెవిలియన్‌ చేరాడు. మరోవైపు స్మిత్‌ (73, 59 బంతుల్లో 7x4, 1x6) అర్ధ శతకం బాదాడు. ఇన్నింగ్స్ చివర్లో బెన్‌స్టోక్స్‌ (7) ధాటిగా ఆడకపోవడంతో.. రాజస్థాన్‌ 139 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో హ్యారీ గుర్నే 2 వికెట్లు తీశాడు.

Story first published: Monday, April 8, 2019, 10:19 [IST]
Other articles published on Apr 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X