DC vs RR: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో ఢిల్లీ అద్భుతంగా రాణించి 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ జట్టు ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 ఓటములు, 2 విజయాలు సాధించింది.
తుది జట్లు ఇవే..
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (w/c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, నితీష్ రాణా, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్: శుభమ్ దూబే, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్, కుమార్ కార్తికేయ, కునాల్ సింగ్ రాథోడ్
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్స్: ముఖేష్ కుమార్, దర్శన్ నల్కండే, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్