For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వికెట్‌​ స్టంప్‌తో బ్యాటింగ్ చేసిన బుడతడికి రాజస్థాన్ రాయల్స్ సాయం.. కారణం సంజు శాంసన్!!

Rajasthan Royals Will Be Sponsoring Kerala 9 Years Old Boy Who Batted With Stump
Rajasthan Royals To Sponsor Kerala Kid Who Batted With Stump | Sanju Samson || Oneindia Telugu

హైదరాబాద్: తాజాగా కేరళలోని త్రిసూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల విగ్నాజ్‌ ప్రెజిత్‌ ఆడిన క్రికెట్ షాట్లకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సాధారణంగా ఒక బ్యాట్స్‌మన్‌ ఒక మ్యాచ్‌లో క్రికెట్‌లోని అన్ని షాట్లు ఆడే ఘటనలు అరుదుగా చోటుచేసుకుంటాయి. కానీ ప్రెజిత్‌ మాత్రం కేవలం ఒక వికెట్‌ స్టంప్‌తో అన్ని రకాల షాట్లు ఆడడం వైరల్‌గా మారింది. దీనిపై ఐపీఎల్ ప్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ స్పందించింది. ప్రెజిత్‌కు బ్యాట్ కొనిచ్చింది. అందుకు కారణం ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్. విషయంలోకి వెళితే...

తొమ్మిదేళ్ల విగ్నాజ్‌ ప్రెజిత్‌కు క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. 2019 ఐపీఎల్‌ చూసినప్పటి నుంచి అతడికి ఆటపై ఇష్టం పెరిగింది. దాంతో అప్పటి నుంచీ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచి మూడు గంటల పాటు ప్రాక్టీస్‌ చేస్తాడు. తమ అపార్ట్‌మెంట్‌ మీదున్న టెర్రస్‌ పైనే చుట్టూ నెట్స్‌ ఏర్పాటు చేసుకొని బ్యాటింగ్‌ సాధన చేస్తాడు. అయితే లాక్‌డౌన్ సమయంలో విగ్నాజ్‌ బ్యాట్ విరిగిపోయింది. దీంతో బయటికి వెళ్లి బ్యాట్ కొనుక్కునే పరిస్థితి లేకపోయింది. చేసేదిలేక బ్యాట్‌తో కాకుండా కేవలం ఒక వికెట్‌తోనే బ్యాటింగ్ చేశాడు.

ఈ క్రమంలోనే విగ్నాజ్‌ ప్రెజిత్‌ ఒక వికెట్‌తోనే బంతిని అన్ని వైపులా దంచికొట్టాడు. ఫ్లిక్‌షాట్‌, ర్యాంప్‌ షాట్‌, కవర్‌ డ్రైవ్, లెగ్‌సైడ్‌, ఆఫ్‌ సైడ్‌ నలుమూలలా ఒకే వికెట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. తనలోని సొగసరి ఆటతో లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ను గుర్తుచేశాడు. ఒక్క సచిన్‌ను మాత్రమే కాదు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను గుర్తుకు తెచ్ఛాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ వీడియోను తొలుత రాజు దేవేంద్రన్‌ అనే ఓ వ్యక్తి లింక్‌డిన్‌లో పోస్టు చేశాడు. దానికి నెటిజెన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. దాంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

చిన్నారి విగ్నాజ్‌కు మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు ఎవరైనా సహాయం చేయాలని తండ్రి ప్రెజిత్‌ కోరాడు. దీర్ఘకాలంలో మంచి శిక్షణ ఇప్పించగలిగితే చిన్నారి భవిష్యత్‌లో గొప్ప క్రికెటర్‌ అవుతాడని పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్ తన ప్రాంచైజీ అధికారులకు పంపాడు. విగ్నాజ్‌ ఆటకు ఫిదా అయిన రాయల్స్ ప్రాంచైజీ ప్రస్తుతం బ్యాట్లు పంపిందట. తర్వాత శిక్షణ కూడా ఇప్పించే అవకాశం ఉంది.

Story first published: Tuesday, May 11, 2021, 12:39 [IST]
Other articles published on May 11, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+