RR vs SRH : రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనున్న సన్ రైజర్స్... గెలిస్తేనే ప్లే ఆఫ్...?

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా గురువారం(అక్టోబర్ 22) దుబాయ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున్న ఉన్న ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైతే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయినట్లే. అదే రాజస్తాన్ రాయల్స్ ఓటమిపాలైతే ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత జటిలం అవుతాయి.

ఇప్పటివరకూ ఆడిన 10 మ్యాచ్‌లలో రాజస్తాన్ నాలుగింటిలో విజయం సాధించి ఆరు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. తదుపరి నాలుగు మ్యాచ్‌లలో గెలిస్తేనే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. లేనిపక్షంలో ఇతర జట్ల గెలుపోటములపై రాజస్తాన్ ప్లే ఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.సన్ రైజర్స్ విషయానికొస్తే... ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచ్‌లలో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. తదుపరి ఆడబోయే ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే తప్ప సన్ రైజర్స్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉండవు.

కాబట్టి నేడు రాజస్తాన్‌తో జరగబోయే మ్యాచ్ సన్ రైజర్స్‌కు కీలకం.

గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయంతో ఊపు మీదున్న రాజస్తాన్ రాయల్స్ అదే ఫామ్‌ను కొనసాగిస్తుందా... లేక సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ను ఓడిస్తుందా అన్నది వేచి చూడాలి. తాజా ఐపీఎల్‌లో అక్టోబర్ 11న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సన్ రైజర్స్ నిర్దేశించిన 158/4 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్‌లో రాజస్తాన్ చేధించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, October 22, 2020, 2:16 [IST]
Other articles published on Oct 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X