Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఫ్రాంచైజీల మాస్టర్ ప్లాన్.. బట్లర్‌ కోసం భారీ ప్లాన్ వేసిన రాజస్థాన్?

ఐపీఎల్ స్టార్ జోస్ బట్లర్‌కు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ బంపరాఫర్ ఇచ్చేందుకు రెడీ అయిందట. గ్లోబల్ క్రికెట్‌లో అతన్ని తమ ఫ్రాంచైజీకి కట్టిపడేయాలని ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడే బట్లర్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. అయితే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం బార్బడోస్ రాయల్స్‌కు ఆడటం లేదు.

ఈ క్రమంలోనే అతన్ని గ్లోబల్ క్రికెట్‌లో రాయల్స్ ఫ్రాంచైజీకి కట్టిపడేయాలని ఒక భారీ డీల్ తయారు చేసిందట ఈ ఫ్రాంచైజీ. మొత్తం నాలుగేళ్ల కోసం ఈ డీల్ చేయాలని అనుకుంటోందట. ఈ ఆఫర్‌ను ఇంకా అధికారికంగా బట్లర్ ముందు ఉంచలేదని సమాచారం. అదే సమయంలో వైట్ బాల్ క్రికెట్‌లో చాలా కెరీర్ ఉన్న బట్లర్.. ఈ డీల్ ఒప్పుకుంటాడా? అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.

Rajasthan Royals trying to tie down Jos Buttler with their franchise

కేవలం రాజస్థానే కాదు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా ఇలాంటి ఒక ఆఫర్ రెడీ చేసిందట. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కు దీన్ని ఇవ్వాలని అనుకుందట. ప్రస్తుతం ఆర్చర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ డీల్ కనుక ఒప్పుకుంటే.. ఆర్చర్ మిగతా లీగ్‌లు కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది. ఐఎల్‌టీ20, ఎంఎల్‌సీ వంటి లీగ్స్‌లో కూడా ముంబై తరఫున ఆడాల్సి ఉంటుంది.

ఇలా చేయాలంటే సదరు ప్లేయర్ తమ దేశ క్రికెట్ బోర్డుతో ఉండే జాతీయ కాంట్రాక్ట్ వదులుకోవాల్సి వస్తుంది. ఐసీసీ టోర్నీల్లో వారిని ఆడించాలంటే.. అతని ఫ్రాంచైజీ యాజమాన్యం నుంచి ఆ దేశ క్రికెట్ బోర్డులు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తమ ఆటగాళ్లను కాపాడుకోవడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ఆలోచన చేస్తోంది. తమ ప్లేయర్లకు ఏటా ఇచ్చే జాతీయ కాంట్రాక్టుల కాలపరిమితిని పెంచాలని అనుకుంటోందట.

ఆటగాళ్లకు ఏకంగా నాలుగేళ్ల పాటు నేషనల్ కాంట్రాక్టు ఇవ్వడం, వారి జీతభత్యాలు కూడా భారీగా పెంచడం ద్వాారా తమ ప్లేయర్లు ఫ్రాంచైజీల్లోకి వెళ్లకుండా చేసేందుకు ఈసీబీ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. బట్లర్, ఆర్చర్ మాత్రమే కాదు.. లియామ్ లివింగ్‌స్టోన్, శామ్ కర్రాన్ వంటి కీలక ప్లేయర్లకు కూడా ఇలాంటి ఆఫర్లు ఇచ్చేందుకు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Thursday, June 29, 2023, 12:50 [IST]
Other articles published on Jun 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+