యుకేపై భారీగా హోప్స్ పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్: షేన్ వార్న వెల్లడి!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ప్రాంఛైజీ అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు తన వ్యాపారాన్ని లండన్‌లో విస్తరించనుందా? అంటే అవుననే సమాధానం వినపిస్తోంది. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్, రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ అంబాసిడర్ షేన్ వార్న్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో రాజస్థాన్ రాయల్స్ యొక్క దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలను వివరించారు.

బుధవారం కియా ఓవల్ స్టేడియంలో జరిగిన ఓ ఈవెంట్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓనర్ మనోజ్ బాదలేతో పాటు షేన్ వార్న్ సైతం పాల్గొన్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు లండన్‌లో బలమైన ఉనికిని కలిగి ఉంది. అందుకు కారణం ఆ జట్టు బ్రిటిష్ యజమాని బాదాలేతో పాటు జట్టులో ఎక్కువమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లను కలిగి ఉండటం.

బంగ్లాతో ఏకైక టెస్టు: అరుదైన ఘనత సాధించిన రషీద్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్‌లు ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెటర్లే కావడం విశేషం. ఈ నేపథ్యంలో యుకేలో తమ బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేసేందుకు రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ ఈ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్‌లో అకాడమీ

ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్ రాయల్స్ ఇంగ్లాండ్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించింది. సర్రేలోని రీడ్స్ స్కూల్‌లో ఉన్న స్టార్ క్రికెట్ అకాడమీతో రాజస్థాన్ ఒప్పందు కుదుర్చుకుంది. స్టార్ క్రికెట్ అకాడమీలో అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్ది అనంతరం దానిని రాజస్థాన్ రాయల్స్ అకాడమీగా పేరు మార్చారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోస్ బట్లర్

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జోస్ బట్లర్

ఈ ఇండోర్ క్రికెట్ ట్రైనింగ్ సెంటర్‌ను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సిద్ధార్థ్ లాహిరీ నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు అంతర్జాతీయ కోచ్‌లు, మెంటార్ల పర్యవేక్షణలో అకాడమీలో ఉన్న యువ క్రికెటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఒకదానితో మరొకటి సంబంధం

ఒకదానితో మరొకటి సంబంధం

ప్రస్తుతం లండన్‌లోని ఈ అకాడమీలో శిక్షణ పొందుతున్న సభ్యులు భారతదేశంలోని రాయల్స్ కోల్ట్స్ (బాయ్స్), రాయల్ స్పార్క్స్ (గర్ల్స్) అకాడమీలలో తమ సహచరులతో స్థలాలను మార్పిడి చేసుకునే అవకాశాన్ని పొందనున్నారు. ఈ విషయంపై షేన్ వార్న్ మాట్లాడుతూ బిజినెస్, స్పోర్ట్స్ ఒకదానితో మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయని తెలిపాడు.

యుకేతో పాటు ఆస్ట్రేలియా, అమెరికాలో సైతం

యుకేతో పాటు ఆస్ట్రేలియా, అమెరికాలో సైతం

ప్రపంచంలోనే అత్యంత పాపులర్ ప్రాంఛైజీలలో ఒకటిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ యంగ్ టాలెంట్‌ని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహిస్తుందని షేన్ వార్న్ చెప్పుకొచ్చాడు. అందుకు ఉదాహరణే సర్రేలోని రీడ్స్ స్కూల్‌లో ఉన్న స్టార్ క్రికెట్ అకాడమీ అని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా యుకేతో పాటు ఆస్ట్రేలియా, అమెరికాలో మాకు పెద్ద ప్రణాళికలు ఉన్నాయని, కాబట్టి మేము ఖచ్చితంగా ప్రదేశాలకు వెళ్తున్నామని వార్న్ అన్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, September 5, 2019, 13:20 [IST]
Other articles published on Sep 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X