డీవై పాటిల్ స్టేడియంలో షేన్ వార్న్‌కు నివాళిగా స్పెషల్ ప్రోగ్రాం.. ఆ స్టిక్కర్లతో బరిలోకి రాజస్థాన్ ప్లేయర్లు
2008లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వార్న్ కెప్టెన్సీ వహించాడు. తొలుత అనామక జట్టు అనుకున్న రాజస్థాన్ రాయల్స్ ఏకంగా టైటిల్‌ను ఎగరవేసుకుపోయి ఆశ్చర్యానికి గురిచేసింది. ఐపీఎల్ విజేతగా నిలవడంలో షేన్ వార్న్ సారథ్యం కీలకమైంది. ఇటీవల షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. 52ఏళ్ల షేన్ వార్న్.. ఆల్ టైం బెస్ట్ క్రికెటర్లలో ఒకరు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుతో అతనికి కెప్టెన్‌గానే కాకుండా మెంటార్‌గానూ మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో తమ మొట్టమొదటి రాయల్ షేన్ వార్న్‌ను స్మరించుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు సిద్ధమైంది. తమ జట్టుకు షేన్ వార్న్ తొలి టైటిల్ అందించిన స్టేడియం అయిన డీవై పాటిల్ స్టేడియంలో ఏప్రిల్ 30న ముంబై ఇండియన్స్‌తో రాయల్స్ తలపడే క్రమంలో.. షేన్ వార్న్‌కు ఆర్ఆర్ ఘన నివాళులర్పించనుంది.

సరైన వేదికగా డీవై పాటిల్ స్టేడియం
ఆర్ఆర్ ఫ్రాంచైజీ.. వార్న్ జీవితాన్ని, అతన్ని స్మరించుకోవడానికి డీవై పాటిల్ స్టేడియం సరైన వేదిక అని భావించింది. అయితే ఆర్ఆర్ ఫ్రాంచైజీ కేవలం దీన్ని సంతాపం తెలియజేసే సందర్భంగానే కాకుండా.. ఓ గొప్ప క్రికెటర్‌ను స్మరించుకోవడానికి అతని మాటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను ప్రభావితం చేయడానికి, క్రికెట్ ఆటకు ఆయన చేసిన ఎనలేని కృషికి సెల్యూట్ చేయడానికి సరైన వేదికగా భావిస్తోంది.

షేన్ వార్న్ ఫ్యామిలీకి ఆహ్వానం
షేన్ వార్న్‌ను స్మరించుకునే కార్యక్రమం ఆర్ఆర్ ఫ్రాంచైజీ ఆధ్వర్యంలో జరగనుంది. దీనికి బీసీసీఐ, అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన స్టార్ స్పోర్ట్స్ కూడా తమ సహకారాన్ని అందించనున్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐకి, స్టార్ స్పోర్ట్స్ వారికి ఆర్ఆర్ ఫ్రాంఛైజీ కృతజ్ఞతలు తెలియజేసింది. వార్న్‌ను ఆరాధించేవారికి, అతని నుంచి క్రికెట్ నైపుణ్యాలు నేర్చుకున్నవారికి, అతనితో కలిసి ఆడిన మాజీ, ప్రస్తుత క్రికెటర్లకు, అభిమానులకు ఈ స్మరణ కార్యక్రమం ముఖ్యమైన సందర్భం కానుందని ఫ్రాంఛైజీ పేర్కొంది. అలాగే వార్న్ కుటుంబానికి కూడా ఈ మేరకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. అతని సోదరుడు జాసన్ వార్న్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. ఈ కార్యక్రమాన్ని రాజస్థాన్ రాయల్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో లైవ్ ప్రసారం చేయనుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ కూడా ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా రాజస్థాన్ ప్లేయర్లు తమ జెర్సీ కాలర్ పైనా, ప్లేయింగ్ కిట్లపైనా 'SW23' అనే స్టిక్కర్లు పెట్టుకోనున్నారు. దీని మీనింగ్ షేన్ వార్న్, అతని జెర్సీ నంబర్ 23. అలాగే స్టేడియంలో షేన్ వార్న్ ట్రిబ్యూట్ గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

తొలి ఐపీఎల్ వివరాలు
2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగింది. ఈ సీజన్లో వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ విజేతగా నిలవగా.. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా షాన్ మార్ష్ ఆరెంజ్ క్యాప్‌ను పొందాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సోహిల్ తన్వీర్ పర్పుల్ క్యాప్‌ని పొందాడు. షేన్ వాట్సన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో యూసుఫ్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications