పైలెటూ విమానం దించు అంటూ రాజస్థాన్ ప్లేయర్ల కేకలు.. ఫ్లైట్‌లో దట్టమైన పొగమంచు

రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ 23బంతుల్లో అజేయంగా 40పరుగులతో చెలరేగడంతో రెండ్రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 లీగ్ దశను విజయవంతంగా రాజస్థాన్ ముగించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో పోలిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ కలిగి ఉన్నందున రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2 ప్లేస్‌కు చేరుకుంది. ఈ విజయం వల్ల క్వాలిఫైయర్ 1లో రాజస్థాన్ రాయల్స్ బెర్త్ ఖాయమైంది. ఇక మే 24న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.
కేకలు వేసిన రాజస్థాన్ ప్లేయర్
ఇక క్వాలిఫైయర్ మ్యాచ్ కోసం ముంబై నుండి కోల్‌కతాకు రాజస్థాన్ టీం శనివారం విమానంలో బయలుదేరింది. ఈ క్రమంలో విమాన ప్రయాణంలో వారికి వింత అనుభవం ఎదురైంది. వాతావరణ పరిస్థితుల వల్ల విమానంలో దట్టమైన పొగమంచు చేరింది. దీంతో రాజస్థాన్ టీంలో ఓ ప్లేయర్ పైలెటు విమానం దించు దించు అంటూ కేకలు వేశాడు. ఇక టీంలోని మరోప్లేయర్ ల్యాండ్ చేస్తున్నాం కాసేపు ఓపిక పట్టు అంటూ సరదాగా అన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ తన అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది.

సురక్షితంగా కోల్‌కతాలో ల్యాండ్
ఈ వీడియోలో యువ ప్లేయర్ యశస్వి జైస్వాల్‌తో సహా ఇతర సభ్యులు చాలా సరదాగా ప్రవర్తించినట్లు కన్పించింది. ఇక పోతే 'హల్లా బోల్' అంటూ రాజస్థాన్ ట్యాగ్ లైన్ ను ప్లేయర్లు నినాదించడం చేశారు. చివరకు విమానం కోల్‌కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. రాజస్థాన్ రాయల్స్ సభ్యులందరూ బైబై చెబుతూ విమానం నుంచి దిగారు.

అసలింతకూ విమానంలో ఏం జరిగిందంటే?
కోల్‌కతాలో ఇటీవల రెండు మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ కోల్ కతా చేరుకుంటుందనగా భారీ ఉరుములు, మెరుపులు విమాన అద్దాల్లో నుంచి ప్లేయర్లు చూశారు. అంతే కాకుండా విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో కాసేపు పొగమంచు వల్ల ఫ్లైట్‌లో పూర్తిగా దట్టమైన మంచు చేరింది. దీంతో రాజస్థాన్ ప్లేయర్లు కాసేపు భయాందోళనకు గురయ్యారు.

అదే గనుక జరిగితే గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్లోకి
వాతావరణ నివేదికల ప్రకారం.. గంటకు 60కిలోమీటర్ల వేగంతో కోల్ కతా పరిసరాలలో గాలులు వీస్తున్నాయి. శనివారం కోల్‌కతాపై దట్టమైన మేఘాలు ఆవరించి భారీ వర్షం కురిసింది. తద్వారా ATK మోహన్ బగాన్, బసుంధర కింగ్స్ మధ్య ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ కప్ మ్యాచ్ నిలిపివేయడం జరిగింది. ఇక ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల క్వాలిఫైయర్ 1కు ఇబ్బంది ఎదురుకావొచ్చని తెలుస్తోంది. అదే గనుక జరిగి మ్యాచ్ రద్దయితే టేబుల్ టాపర్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఇక మే 27న క్వాలిఫైయర్ 2లో ఎలిమినేటర్ విజేతతో రాజస్థాన్ ఆడాల్సి వస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications