Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్టన్నింగ్ క్యాచ్.. షాకైపోయిన ఫ్యాన్స్!

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అద్భుతమైన ఫీల్డింగ్‌ చేశాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్‌లో లాన్‌కన్‌షైర్‌కు బట్లర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్ ఆడుతుండగా బట్లర్ తన సూపర్ ఫీల్డింగ్‌తో అందరికీ షాకిచ్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత నార్తంప్టన్‌షైర్ బ్యాటింగ్ చేసింది. ఆ టీంలో క్రిస్ లిన్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

మిగతా బ్యాటర్లు చాలా దారుణంగా ఆడటంతో నార్తంప్టన్‌షైర్ కేవలం 138 పరుగులే చేయగలిగింది. ఈ స్వల్ప లక్ష్య ఛేదనలో జోస్ బట్లర్‌తోపాటు మరో ఇంగ్లండ్ స్టార్ లియామ్ లివింగ్‌స్టోన్ కూడా ఫెయిలయ్యారు కానీ మిగతా ఆటగాళ్లు రాణించడంతో లాన్‌కన్‌షైర్ సులభంగా ఈ మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నార్తంప్టన్‌షైర్ బ్యాటర్ ల్యూక్ బుడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు.

 Jos Buttler took a stunning catch

రికార్డో వాస్కొంన్సెలో వేసిన బంతిని అతను సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్‌కు దూరంగా వెళ్లింది. అది కచ్చితంగా బౌండరీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కీపర్‌గా బట్లర్ మాత్రం వేరే ప్లాన్‌లో ఉన్నాడు. తన ఎడం చేతి వైపు అద్భుతమైన డైవ్ చేసి క్యాచ్ పట్టేశాడు. ఈ క్యాచ్ చూసిన బట్లర్ సహచర ఆటగాళ్లు కూడా షాకైపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఫీల్డింగ్‌లో చెలరేగిన బట్లర్.. బ్యాటుతో మాత్రం తేలిపోయాడు. మొత్తం 11 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 11 పరుగులే చేయగలిగాడు. వీటిలో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉండటం గమనార్హం. అతనితోపాటు లియామ్ లివింగ్‌స్టోన్ (11) కూడా ఫెయిలయ్యాడు. అయితే మిగతా బ్యాటర్లు రాణించడంతో మరో 20 బంతులు మిగిలుండగానే ఆరు వికెట్ల తేడాతో లాన్‌కన్‌షైర్ ఘనవిజయం సాధించింది. లీగ్‌లో ఈ టీంకు ఇది ఎనిమిదో విజయం కావడం గమనార్హం.

Story first published: Monday, July 3, 2023, 17:54 [IST]
Other articles published on Jul 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+