ఐపీఎల్ 2019: దశాబ్దం తర్వాత కప్‌ను ముద్దాడాలన్న కసితో రాజస్థాన్


హైదరాబాద్: మార్చి 23 (శనివారం) ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఐపీఎల్‌లో ఆడేందుకు అటు స్వదేశీ క్రికెటర్లతో పాటు ఇడు విదేశీ ఆటగాళ్లు సైతం సిద్ధమయ్యారు. ఇప్పటికే విదేశీ ఆటగాళ్లు ఆయా ప్రాంఛైజీలతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా మొదలెట్టారు. ఈ వేసవిలో అభిమానులకు కనువిందు చేసేందుకు ఐపీఎల్‌లోని అన్ని జట్లూ వ్యుహ, ప్రతి వ్యుహాలతో రంగం సిద్ధం చేసుకున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. ఎప్పుడో ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈసారి కప్‌ను ముద్దాడాలన్న కసితో పోటీకి దిగుతోంది. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మార్గనిర్దేశకత్వంలో ఈ సీజన్‌లో ముందుకు సాగేందుకు పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది.

యువ ఆటగాళ్లు రాజస్థాన్ సొంతం
అద్భుతమైన యువ ఆటగాళ్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు సొంతం. దేశవాళీ క్రికెట్‌లో మెరుపులు మెరిపించిన మనన్ వోహ్రా, ప్రశాంత్ చోప్రా, రాహుల్ త్రిపాఠి, జైదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్, సంజూ శాంసన్, కృష్ణప్ప గౌతమ్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. వీరంతా కూడా ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తహతహలాడుతున్నారు.

ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించారు
గత సీజన్‌లో శ్రేయాస్ గోపాల్, సంజూ శాంసన్, కృష్ణప్ప గౌతమ్‌లు ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించిన సందర్భాలు అనేకం. ఇక, రాజస్థాన్ మార్గదర్శికుడిగా ఉన్న షేన్ వార్న్ యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. గాయం కారణంగా సంజూ శాంసన్ ఈసారి లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు.

వరల్డ్‌కప్‌లో లక్ష్యంగా స్టీవ్ స్మిత్
దీంతో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్ని, రాహుల్ త్రిపాఠి, శ్రేయాస్ గోపాల్ లాంటి వాళ్లు చెలరేగాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ ద్వారా రానున్న వరల్డ్‌కప్ మెగాటోర్నీకి ఆసీస్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా స్మిత్ బరిలోకి దిగుతున్నాడు. భారత్‌లోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న స్మిత్ తనదైన శైలిలో ప్రత్యర్థులపై చెలరేగగలడు.

ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించిగల బట్లర్
గత సీజన్‌లో స్టోక్స్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయినా.. జోష్ బట్లర్ ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించాడు. దీంతో ఈ సీజన్‌లో వీరిద్దరూ మిడిలార్డర్‌లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక, బౌలింగ్ పరంగా చూస్తే రూ.8.4 కోట్లకు తిరిగి తీసుకున్న లెఫ్టార్మ్ పేసర్ జైదేవ్ ఉనద్కత్‌పై రాయల్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఉనాద్కత్‌కు జతగా వరుణ్ ఆరోన్, దవల్ కులకర్ణితో బౌలింగ్ బలంగా కనిపిస్తున్నది.
పింక్ జెర్సీతో బరిలోకి
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీతో బరిలోకి దిగనుంది. 2018 ఐపీఎల్ సీజన్‌లో క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ కలర్ జెర్సీతో ఓ మ్యాచ్ ఆడిన రాజస్థాన్ జట్టు.. 2019 సీజన్‌లో అన్ని మ్యాచ్‌ల్లోనూ అదే జెర్సీతో ఆడబోతున్నట్లు వెల్లడించింది.
రాజస్థాన్ రాయల్స్
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: అజింక్య రహానే, కృష్ణప్ప గౌతమ్, సంజూ శాంసన్, శ్రేయస్ గోపాల్, ఆర్యమన్ బిర్లా, ఎస్.మిథున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఇష్ సోధీ, ధావళ్ కులకర్ణి, మహిపాల్ లోమ్రార్.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: జయదేవ్ ఉనద్కత్ (రూ.8.2 కోట్లు), వరుణ్ ఆరోన్ (రూ.2.4 కోట్లు), ఒషానే థామస్ (రూ.1.10 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.30 లక్షలు), లియామ్ లివింగ్‌స్టోన్ (రూ.50 లక్షలు), శుభ్‌మన్ రంజానే (రూ.20 లక్షలు), మనన్ వోహ్రా (రూ.20 లక్షలు), ఆస్టన్ టర్నర్ (రూ.50 లక్షలు), రియాన్ పరాగ్ (రూ.20 లక్షలు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications