For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో సత్తా చాటి వరల్డ్‌కప్ జట్టులో చోటు సంపాదిస్తా: రహానే

If I Do Well In IPL, World Cup Spot Will Follow: Rahane | Oneindia Telugu
Rajasthan Royals skipper Ajinkya Rahane confident of bagging World Cup spot with good show in IPL 2019

హైదరాబాద్: ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కుతుందా లేదా నే దాని గురించి ఆలోచించడం లేదని టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యింకె రహానే అన్నాడు. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో

తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను సైతం భారత్‌ కోల్పోయింది. దీంతో కొన్ని స్థానాల భర్తీ విషయంలో టీమిండియాకు ఇంకా స‍్పష్టత రాలేదు. ముఖ్యంగా నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది.

మళ్లీ No. 4పై మొదలైన చర్చ

మళ్లీ No. 4పై మొదలైన చర్చ

దీంతో మళ్లీ No. 4పై చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రహానే వరల్డ్‌కప్‌ జట్టులో బెర్తుపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో రాణించి వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకుంటాననే ఆశాభావ వ్యక్తం చేశాడు. ఈ సందర్బంగా రహానే ఐఎఎన్ఎస్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

పరుగులు చేయడంపైనే దృష్టి సారించాలి

పరుగులు చేయడంపైనే దృష్టి సారించాలి

"మనం ఏ టోర్నీ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. కేవలం మనం ఆడే మ్యాచ్‌ల్లో పరుగులు చేయడంపైనే దృష్టి సారించాలి. ఇప్పుడు నా ముందున్న అవకాశం ఐపీఎల్‌. ఐపీఎల్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోటు దక్కుతుంది. అయినా ఇప్పుడు వరల్డ్‌కప్‌ బెర్తు దక్కుతుందా లేదా అనే దాని గురించి ఆలోచించడం లేదు" అని రహానే అన్నాడు.

రాజస్థాన్ జట్టుని విజయ పథంలో నడిపించడంపైనే

రాజస్థాన్ జట్టుని విజయ పథంలో నడిపించడంపైనే

ఐపీఎల్‌‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుని విజయ పథంలో నడిపించడంపైనే ప్రస్తుతం తన దృష్టంతా ఉందని రహానే తెలిపాడు. కాగా, ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక ఉండదని కొన్ని రోజుల క్రితం చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో 176 మ్యాచ్‌లాడిన రహానే.. 34 హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ సాయంతో 4,537 పరుగులు చేశాడు.

Story first published: Saturday, March 16, 2019, 14:58 [IST]
Other articles published on Mar 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+