Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లోకి బ్యాల్ ట్యాంపరింగ్ గాలులు

Rajasthan Royals To Sack Steve Smith As Captain After Ball-tampering Row?

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా స్టీవ్ స్మిత్‌ను ఉంచాలా.. తొలగించాలా అనే దిశగా చర్చలు జరుపుతోంది జట్టు యాజమాన్యం. శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో స్టీవ్ స్మిత్ జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ దుమారం ఐపీఎల్‌ను సైతం తాకాయి.

దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. బాల్‌ ట్యాంపరింగ్‌కు చెయ్యమని తానే చెప్పానని, ఇదంతా తమ సామూహిక పాపమేనని స్మిత్‌ అంగీకరించాడు. అదే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ స్టీవ్ స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇంకా వేటుపడక ముందే వార్నర్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంది.

దేశీయంగా జరిగే టీ20 క్రీడా ఉత్సవం ఐపీఎల్‌ను కూడా ఈ వివాదం ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌ ఎడిషన్‌లో రాజస్థాన్‌ జట్టుకు స్టీవ్‌ స్మిత్‌ సారథిగా వ్యవహరించాల్సి ఉంది. తాజా వివాదం నేపథ్యంలో అతన్ని రాజస్థాన్‌ జట్టు కెప్టెన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే సందిగ్ధంలో జట్టు యాజమాన్యం చర్చలు జరుపుతోంది.

ఈ వివాదంలో తదుపరి పరిణామాలను బట్టి ఐపీఎల్‌లోనూ స్మిత్‌ ను జట్టు సారథిగా తొలగించే దిశగా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో స్మిత్‌ క్రీడా భవిష్యత్తుపై ముగిసినట్లేనని విశ్లేషకుల అంచనా.. అయితే స్టీవ్ స్మిత్‌కు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదంటూ తోసిపుచ్చేవారు లేకపోలేదు.

Story first published: Sunday, March 25, 2018, 17:07 [IST]
Other articles published on Mar 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+