For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్

IPL 2020 : Rajasthan Royals Appoint Former Australia All-Rounder As Head Coach || Oneindia Telugu
Rajasthan Royals rope in former Australia all-rounder Andrew McDonald as head coach

హైదరాబాద్: ఐపీఎల్ 2020 కోసం రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను నియమించుకుంది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ప్రస్తుత కోచ్ పాడీ ఆప్టన్ స్థానంలో ఆయన మూడేళ్ల కాలానికి నియమిస్తూ రాజస్థాన్ ఫ్రాంఛైజీ నిర్ణయం తీసుకుంది.

వచ్చే సీజన్ కోసం కోల్‌కతాలో డిసెంబర్ 19న జరగనున్న ఐపీఎల్ వేలంతో రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ తొలి అసైన్మెంట్ మొదలుకానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో గత కొంతకాలంగా మెక్‌డొనాల్డ్ భాగంగానే ఉన్నారు. 2009లో ఆయన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ తర్వాత 2012, 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు కొన్నాళ్లు ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించారు. మెక్‌డొనాల్డోకు కోచింగ్‌లో అపార అనుభవం ఉంది. ఇప్పటికే లీసెస్టర్‌షైర్, విక్టోరియా, మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్లకు మార్గనిర్దేశం చేశాడు.

బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో ఆండ్రూ ప్రధాన పాత్ర పోషించాడు. 38 ఏళ్ల మెక్‌డొనాల్డ్ సేవలు వినియోగించుకొని మరోసారి ఐపీఎల్ విజేతగా నిలువాలని రాజస్థాన్ యజమాన్యం భావిస్తోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.

రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా నియమింపబడటంపై ఆండ్రూ మెక్‌డొనాల్డో మాట్లాడుతూ "నేను రాయల్స్ కుటుంబంలో చేరడం ఆనందంగా ఉంది. ఈ బాధ్యతలు చేపట్టడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నాకు సవాల్‌తో కూడుకున్నది. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా లీగ్‌లలో ఒకటిగా ఉన్న ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు, కోచ్‌లతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతృతగా ఉన్నాను" అని అన్నాడు.

Story first published: Monday, October 21, 2019, 17:20 [IST]
Other articles published on Oct 21, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+