Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పింక్ ప్రామిస్: ప్రతి సిక్సర్‌కు 6 ఇళ్లకు విద్యుత్!

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంటోంది. మే 9న జైపూర్లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్‌ను 'పింక్ ప్రామిస్ మ్యాచ్'గా రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. ఆ జట్టు వరుసగా మూడో ఏడాది 'పింక్ ప్రామిస్ మ్యాచ్'ను నిర్వహిస్తోంది. మహిళల నేతృత్వంలోని సమూల మార్పును ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా మే 9న జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ ప్లేయర్లు తమ సాధారణ జెర్సీకి బదులుగా పూర్తి గులాబీ రంగు జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు. "ఔరత్ హై తో భారత్ హై" (మహిళ ఉంటేనే భారత్ ఉంది) అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగుతోంది.

ప్రత్యేక జెర్సీ వెనుక ఉన్న కథ
ఈ సీజన్ కోసం రూపొందించిన పింక్ జెర్సీకి ఓ ప్రత్యేకత ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన డిజైన్ పోటీలో నాసిక్‌కు చెందిన 19 ఏళ్ల సమీక్ష రామేశ్వర్ ముండాడ రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేశారు. ఈ జెర్సీపై ఉన్న అలల వంటి ఆకృతి.. మార్పు అనేది ఓ వ్యక్తితో మొదలై కుటుంబం, సమాజం అంతటా ఎలా విస్తరిస్తుందో సూచిస్తుంది. అలాగే రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ మద్దతు పొందుతున్న మహిళల పేర్లను కూడా ఈ జెర్సీపై ముద్రించడం విశేషం.

Rajasthan Royals Pink Promise Match 2026 One Sixer to Light Up Six Homes for Women Empowerment

సిక్సర్ కొడితే.. ఆరు ఇళ్లకు వెలుగు
ఈ చొరవలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే,, గ్రౌండ్‌లో ప్లేయర్లు ప్రదర్శించే ప్రతిభ నేరుగా సామాజిక మార్పుకు తోడ్పడుతుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు బాదే ప్రతి సిక్సర్‌కు ప్రతిఫలంగా ఆరు ఇళ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని రాజస్థాన్ రాయల్స్ కల్పిస్తుంది. గత రెండేళ్లలో ఈ కార్యక్రమం ద్వారా సుమారు 780 ఇళ్లకు సోలార్ పవర్ అందించారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో మరిన్ని గ్రామాల్లో వెలుగులు నింపాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

సామాజిక మార్పులో క్రికెట్ శక్తి
రాజస్థాన్ రాయల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలోక్ చిత్రే మాట్లాడుతూ.. పింక్ ప్రామిస్ అనేది కేవలం ఓ మ్యాచ్ మాత్రమే కాదని, అది ఒక ఉద్యమమని పేర్కొన్నారు. కేవలం క్రికెట్‌కే పరిమితం కాకుండా సమాజంలో మహిళల స్థాయిని పెంచడం, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం తమ బాధ్యతని ఆయన అన్నారు. సంభార్ ప్రాంతంలోని మహిళలకు సోలార్ మౌలిక సదుపాయాల నిర్వహణలో శిక్షణ ఇచ్చి, వారిని స్వావలంబన దిశగా ఈ ప్రాజెక్ట్ నడిపిస్తోంది. క్రికెట్ ద్వారా సామాజిక మార్పును తీసుకురావడంలో రాజస్థాన్ రాయల్స్ వేస్తున్న ఈ అడుగులు ప్రశంసనీయం.

Story first published: Thursday, May 7, 2026, 14:32 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+