Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Barbados Royals: పేరు మార్చుకోనున్న సీపీఎల్​ జట్టు.. కారణం రాజస్థాన్ రాయల్స్!!

Rajasthan Royals owners bought a majority stake in CPL franchise Barbados Tridents

ముంబై: కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​ (సీపీఎల్)లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యాజమాన్యాలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ జాబితా క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. సీపీఎల్ జట్టు బార్బడోస్​ ట్రిడెంట్‌లోని మెజారిటీ భాగాన్ని ఐపీఎల్​కు చెందిన రాజస్థాన్​ రాయల్స్ యాజమాన్యం​ కొనుగోలు చేసింది. దీంతో బార్బడోస్​ ట్రిడెంట్‌ జట్టు పేరు బార్బడోస్​ రాయల్స్​గా మారనుంది. ఫలితంగా సీపీఎల్‌లో జట్టును సొంతం చేసుకున్న మూడో ఐపీఎల్​ ఫ్రాంచైజ్​గా రాజస్థాన్​ రాయల్స్​ నిలిచింది. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ 65 శాతం వాటాను కొనుగోలు చేసింది.

 రెండుసార్లు విజేతగా:

రెండుసార్లు విజేతగా:

కోల్‌కతా నైట్ రైడర్స్ యజమానులు, రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్మెంట్ 2015లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టును కొనుగోలు చేసింది. గత సంవత్సరం పంజాబ్​ కింగ్స్​కు చెందిన కేపీహెచ్​ డ్రీమ్​ క్రికెట్​ ప్రైవేట్​ లిమిటెడ్​.. సెంట్​ లుసియా జౌక్స్​ను కొనుగోలు చేసింది. ఇప్పుడు రాజస్థాన్​ రాయల్స్.. బార్బడోస్​ ట్రిడెంట్‌లోని మెజారిటీ భాగాన్ని తీసుకుంది. సీపీఎల్‌లో బార్బడోస్ రెండుసార్లు విజేతగా నిలిచింది. ఇక 2020 ఎడిషన్‌లో బార్బడోస్ 10 గేమ్‌లలో కేవలం మూడు విజయాలతో ఐదవ స్థానంలో నిలిచింది.

 65 శాతం వాటా:

65 శాతం వాటా:

రాయల్స్​ ఫ్రాంచైజ్​లో 65శాతం వాటాను సంపాదించుకున్న ఈఎమ్​ స్పోర్టింగ్​ హోల్డింగ్స్​ లిమిటెడ్​ యజమాని మనోజ్​ బదాలే ఈ విషయంపై స్పందించారు. 'రాజస్థాన్​ రాయల్స్​కు ప్రపంచవ్యాప్తంగా నెట్​వర్క్​ను పెంచాలని ఎన్నో ఏళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ అవకాశం మాకు దక్కింది. ఏడాది మొత్తాన్ని పరిగణిస్తే.. అందులో ఐపీఎల్​ కేవలం ఓ చిన్న భాగం. అభిమానులు తమకు ఇష్టమైన రాయల్స్​ టీమ్​కు మద్దతు పలికేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్రికెట్​ పరంగా కొత్త విషయాలపై ప్రయోగాలు చేసినట్టు ఉంటుంది. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నాం' అని అన్నాడు.

అక్కడ కూడా సంగానే:

అక్కడ కూడా సంగానే:

సీపీఎల్​ 2021 సీజన్​ ఆగస్టు 26న ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్​ డైరక్టర్​గా వ్యవహరిస్తున్న శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర.. సీపీఎల్​లో తమ కొత్త టీమ్​ వ్యవహారాలను కూడా చూసుకోనున్నారని మనోజ్​ బదాలే స్పష్టం చేశారు. ఇక ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో రాజస్థాన్ ఐదవ స్థానంలో ఉంది. ఐపీఎల్ టీమ్‌లు అన్నీ ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి బయలుదేరనున్నాయని సమాచారం.

 పట్టికలో ఐదవ స్థానం:

పట్టికలో ఐదవ స్థానం:

వాయిదా పడిన సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ సమయంలో ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు వచ్చే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్‌ బట్లర్‌ దూరం కానున్నాడు. ఇదే జరిగితే రాజస్థాన్ జట్టుకు భారీ షాక్ తగలనుంది సంజు శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ 7 మ్యాచుల్లో మూడు విజయాలు అందుకుని పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.



Story first published: Saturday, July 31, 2021, 13:10 [IST]
Other articles published on Jul 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+