Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ధోనీ, కోహ్లీతో పాటు ఇండియాను కలిపి తిట్టిన జోఫ్రా ఆర్చర్

Rajasthan Royals' new IPL buy Jofra Archer slammed for 'anti-India, MS Dhoni' tweets

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ కొనుగోళ్లు చేపట్టింది. 2008లోనైతే ఈ జట్టు ఒక్క ఆటగాడిని కొనుగోలు చేసిన అత్యధిక ధర రూ.11.5 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసింది. ఈ ఏడాది వేలంలో బెన్ స్టోక్స్‌ను, జయదేవ్ ఉనదక్త్‌లను విడివిడిగా రూ.12.5 కోట్లకు కొనుక్కుంది. ఇదిలా ఉంటే జట్టు గురించి ఓ వివాదాస్పద విషయం చోటు చేసుకుంది.

ఐపీఎల్‌ వేలంలో వెస్టిండీస్‌ ప్లేయర్‌ జోఫ్రా ఆర్చర్‌‌ను రూ. 7.2 కోట్లకు కొనుగోలు చేసింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెరుపులు మెరిపించిన ఈ బౌలర్‌ను రాజస్థాన్‌ అత్యధిక ధర వెచ్చించి ఆశ్చర్యపరిచింది. దీంతో ఎవరా విండీస్‌ ప్లేయర్‌ అని అందరూ ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో 'టీమిండియాకు, ధోనీకి' వ్యతిరేకంగా జోఫ్రా గతంలో చేసిన ట్వీట్లు బయటపడ్డాయి. రెండేళ్ల క్రితం భారత జట్టుకు వ్యతిరేకంగా అతను ట్వీట్లు పెట్టాడు. 'భారత్‌ను కూల్చాలని, ధోనీ తాను తెలివైన వాడినని అనుకుంటున్నాడు..' అని ట్వీట్లు చేశాడతను. దీంతో జోఫ్రాపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు.

ఐపీఎల్ పదకొండో సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభమై ఫైనల్‌ను మే 27తో ముగించనుంది. రెండేళ్ల పాటు స్పాట్ ఫిక్సింగ్‌ల నిషేదం అనంతరం రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ లీగ్ లోకి అడుగుపెట్టనున్నాయి.

ఐపీఎల్ వేలం అనంతరం ఎంపిక చేసిన తుది జట్టు:
1. స్టీవ్ స్మిత్ (రూ.12 కోట్లు-Retained)
2. బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు)
3. రహానే (రూ.4 కోట్లు-RTM)
4. స్టువర్ట్ బిన్నీ (రూ.50 లక్షలు)
5. సంజు శాంసన్ (రూ.8 కోట్లు)
6. జోస్ బట్లర్ (రూ.4.4 కోట్లు)
7. రాహుల్ త్రిపాఠి (రూ.3.4 కోట్లు)
8. డార్సీ షార్ట్ (రూ.4 కోట్లు)
9. జోఫ్రా ఆర్చర్ (రూ.7.2 కోట్లు)
10. గౌతమ్ క్రిష్ణప్ప (రూ.6.2 కోట్లు)
11. ధవల్ కులకర్ణి (రూ.75 లక్షలు-RTM)
12. జయదేవ్ ఉనద్కట్ (రూ.11.5 కోట్లు)
13. అంకిత్ శర్మ (రూ.20 లక్షలు)
14. అనురీత్ సింగ్ (రూ.30 లక్షలు)
15. జహీర్ ఖాన్ పక్టీన్ (రూ.60 లక్షలు)
16. శ్రేయాస్ గోపాల్ (రూ.20 లక్షలు)
17. ప్ర‌శాంత్ చోప్రా (రూ.20 ల‌క్ష‌లు)
18. మ‌హిపాల్ లామ్‌రోర్ (రూ.20 ల‌క్ష‌లు)
19. జ‌తిన్ స‌క్సేనా (రూ.20 ల‌క్ష‌లు)
20. ఆర్య‌మాన్ విక్ర‌మ్ బిర్లా (రూ.30 ల‌క్ష‌లు)
21. దుష్మంత చ‌మీరా (రూ.50 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 11:06 [IST]
Other articles published on Jan 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+