ఓటమి నుండి చాలా నేర్చుకున్నాం: రహానే

గత మ్యాచ్ ఓటమి నుండి చాలా నేర్చుకున్నాం. వచ్చే మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించేందుకు ప్రయతింస్తాం అని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అంజిక్య రహానే అన్నారు. ఆదివారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఓటమిని ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా 139 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా ఓపెనర్లు లిన్, నరైన్ విజృంభించడంతో 13.5 ఓవర్లలోనే విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రహానే మాట్లాడుతూ... 'ఈ వికెట్ పై 150-160 పరుగులు చేసి ఉంటే మ్యాచ్‌ను కాపాడుకునేవాళ్ళం. వికెట్ నెమ్మదించడంతో పరుగులు చేయడం కష్టమైంది. బౌలింగ్ లో కూడా మా ప్రణాళికలు సరిగ్గా అమలుచేయలేకపోయాం. ఆటలో గెలుపోటములు సహజం. అయితే ఓటమి నుండి మేము చాలా నేర్చుకున్నాం. వచ్చే మ్యాచ్‌లలో మెరుగ్గా రాణించేందుకు ప్రయతింస్తాం' అని రహానే తెలిపారు.
'మ్యాచ్ ఓడిపోతేనే కొత్త విషయాలు తెలుస్తాయి. ఓటముల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ అన్ని మ్యాచుల్లోనూ బాగానే ఆడాం. 3 మ్యాచ్‌లలో గెలిచే అవకాశం ఉన్నా.. దురదృష్టవశాత్తు ఓడిపోయాం. ఓటమికి ఒకరిని బాద్యున్ని చేయడం సరికాదు. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ చివరి వరకూ ఉండి పరుగులు చేయడానికి ప్రయత్నించాలని' రహానే చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications