Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఊకో అన్న ఊకో- అసలే టైమ్ బ్యాడ్

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో మట్టికరిచింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అయ్యాయి. మరోవంక ఢిల్లీ క్యాపిటల్స్ తన ప్లేఆఫ్స్ ఛాన్సులను సజీవంగా ఉంచుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ తమ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు గెలవాల్సిన పరిస్థితిలో పడింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), కెప్టెన్ రియాన్ పరాగ్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వైభవ్ సూర్యవంశీ (24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) మెరుపు ఇన్నింగ్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ నాలుగు వికెట్లు తీయగా.. లుంగి ఎంగిడి, మాధవ్ తివారి రెండేసి వికెట్లు పడగొట్టారు.

Rajasthan Royals Fielding Collapse Triggers Coach Kumara Sangakkara s Outburst During DC Match

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 197 పరుగులు చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్ (42 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 56), అభిషేక్ పోరెల్ (31 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. అక్షర్ పటేల్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), అషుతోష్ శర్మ (5 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 18 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ రెండేసి వికెట్లు తీయగా.. డాసన్ షనక ఒక వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేసిన పొరపాట్లు అన్నీ ఇన్నీ కావు. క్యాచ్ లను వదిలేయడం ఒక ఎత్తయితే.. ఫీల్డింగ్ లోనూ బంతులను జారవిడవడం మరో ఎత్తు. కెప్టెన్ రియాన్ పరాగ్ స్వయంగా మిస్ ఫీల్డ్ చేశాడు. సునాయాసంగా అందుకోవాల్సిన బంతిని చేజార్చాడు. ప్రత్యర్థి జట్టుకు మూడు పరుగులు ధారాదత్తం చేశాడు. ఇటువంటి సందర్భాలు రాజస్థాన్ రాయల్స్ లో చాలా కనిపించాయి. పరోక్షంగా అదనపు పరుగులను సమర్పించుకుంది.

ఈ ప్రహసనం కోచ్ కుమార సంగక్కారకు తీవ్ర అసహనానికి గురి చేసింది. డగౌట్ లో కూర్చుని మ్యాచ్ చూస్తోన్న సంగక్కర ఒక దశలో సహనం కోల్పోయాడు. డగౌట్ నుండి కోపంగా కేకలు వేయడం కనిపించింది. కేప్టెన్ రియాన్ పరాగ్ మిస్ ఫీల్డ్ చేయడంపై మండిపడ్డాడు. దీనికి బదులుగా పరాగ్ కూడా గ్రౌండ్ నుంచే చేతులతో సంజ్ఞలు చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ అయింది.

Story first published: Monday, May 18, 2026, 12:01 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+