ఐపీఎల్ 2019: రూ.11.5 కోట్లు పలికిన ఉనద్కత్ రిలీజ్‌కు అసలు కారణం!


హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర అమ్ముడుపోయిన భారత క్రికెటర్‌గా జయదేవ్ ఉనద్కత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం అతడిని జట్టులో కొనసాగించేందుకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇష్టపడలేదు. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పూర్తయిన ఆటగాళ్లతో పాటు ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదులుకున్నాయి. ఐపీఎల్ 2019 సీజన్ కోసం అట్టిపెట్టుకున్న, విడిచిపెడుతున్న ఆటగాళ్ల జాబితాని శుక్రవారం సాయంత్రం ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్ తమ జట్టు నుంచి అనూహ్యంగా జయదేవ్ ఉనద్కత్‌ని వేలానికి విడుదల చేసి ఆశ్చర్యపరిచింది.

రూ. 11.5కోట్లు వెచ్చించి కోనుగోలు చేసిన రాజస్థాన్
2018 సీజన్ ఆటగాళ్ల వేలంలో జయదేవ్ ఉనద్కత్ కోసం ఫ్రాంఛైజీలతో ఆఖరి వరకూ పోటీపడిన రాజస్థాన్ రాయల్స్ ఏకంగా రూ. 11.5కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అయితే, 2018 సీజన్‌లో జయదేవ్ పేలవ ప్రదర్శనతో నిరూత్సాహపరిచాడు. అంతేకాదు 15 మ్యాచ్‌లాడి తీసిన వికెట్లు 11 మాత్రమే. దీంతో ఫ్రాంఛైజీ అతడిని విడుదల చేసిందని అందరూ భావించారు.

రాజస్థాన్ క్రికెట్ హెడ్ జుబిన్ బరాక్ మాట్లాడుతూ
అయితే, జయదేవ్ ఉనద్కత్‌ను విడుదల చేయడానికి వేరే కారణం ఉందని తాజాగా ఫ్రాంఛైజీ వెల్లడించింది. రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ హెడ్ జుబిన్ బరాక్ మాట్లాడుతూ "ఐపీఎల్ 2018 సీజన్‌లో జయదేవ్ ప్రదర్శన గురించి చర్చించే సమయంలో.. అతను తాను అమ్ముడుపోయిన ధర గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. బౌలింగ్ సమయంలోఆ ఒత్తిడికి గురవడంతో అతని ప్రదర్శన దెబ్బతింది. అందుకే అతడిని జట్టు నుంచి విడిచిపెట్టడమే మంచిదని నిర్ణయించాం" అని చెప్పాడు.

ఐపీఎల్ పదో సీజన్‌లో 24 వికెట్లు తీసిన జయదేవ్
ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఆడిన జయదేవ్ ఉనద్కత్ కేవలం 12 మ్యాచ్‌లాడి ఏకంగా 24 వికెట్లు తీశాడు. దీంతో 2018 సీజన్ వేలంలో జయదేవ్‌కు డిమాండ్ అమాంతం పెరిగింది. వేలంలో సైతం పలు ప్రాంఛైజీలు కోట్లు కుమ్మరించేందుకు యత్నించాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 11.5 కోట్లు పెట్టి అతడిని సొంతం చేసుకుంది. అయితే, గత సీజన్‌లో అతడిపై పెట్టుకున్న అంచనాల్ని అందుకోలేకపోయాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు:
ఇన్: ఎవరూ లేరు
రిలీజ్ చేసిన ఆటగాళ్లు: జయదేవ్ ఉనద్కత్, అనురీత్ సింగ్, అంకిత్ శర్మ, జతిన్ సక్సేనా, డార్సీ షార్ట్, బెన్ లాఫ్లిన్
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, ఇష్ సోధీ, రహానే, గౌతమ్, సంజూ శాంసన్, శ్రేయాస్ గోపాల్, ఆర్యమాన్ బిర్లా, మిథున్, ప్రశాంత్ చోప్రా, స్టువర్ట్ బిన్నీ, రాహుల్ త్రిపాఠి, ధావల్ కులకర్ణి, మహిపాల్ లోమ్రోర్
ఫ్రాంచైజీ వద్ద అందుబాటులో ఉన్న నగదు: 20.95cr
అందుబాటులో ఉన్న స్లాట్స్ మొత్తం 9: Indian 6, Overseas 3
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications