
కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అభిమానులను ఎంటర్టైన్ చేసే జట్టు ఐపీఎల్లో ఏదైనా ఉందంటే అది రాజస్థాన్ రాయల్స్ మాత్రమే. అప్పుడప్పుడు క్రికెటర్ల మీద ప్రాంక్‌లు, ఫన్నీ కన్వర్సేషన్స్ ఈ టీంలో జరుగుతుంటాయి. ఇటీవలే ట్రెంట్ బోల్ట్ మీద తోటి ప్లేయర్లు ప్రాంక్ చేయగా.. తాజాగా ఆర్ఆర్ పేసర్ ప్రసీద్ కృష్ణ ప్రాంక్‌కు బలయ్యాడు. ప్రసీద్‌పై ఈ ప్రాంక్‌ను చేయించింది ఆర్ఆర్ ప్లేయర్లు యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, కేసీ కరియప్ప. ఇక రాజస్థాన్ ఫ్రాంచైజీ కంటెంట్ టీంను ఉపయోగించుకుని ప్రసిద్ధ్ కృష్ణపై ఈ ముగ్గురు ప్రాంక్ చేయించారు. ప్రసీద్ కోసం ఓ నకిలీ ఫోటోషూట్‌ను ఏర్పాటు చేశారు. కెమెరామాన్, లైటింగ్ అంతా సెటప్ చేయించారు.
ఇక ప్రసీద్ రెడీ అయ్యాక హిందీ చిత్రం భూల్ భులయ్యా మూవీలోని హరే రామ్, హరే రామ్ అనే పాటకు భావాలు పలికించాలని ప్రసీద్‌తో చెప్పగా.. అతను ఇదో కొత్త రకం ప్రమోషనా అన్నట్లు ఫేస్ పెట్టాడు. అయినప్పటికీ ఏదోలా చేశాడు. అతను అలా చేస్తున్నప్పుడు కెమెరామాన్ ముఖం దగ్గరికి కెమెరా పెట్టడంతో ప్రసీద్ తెగ ఇబ్బంది పడిపోయాడు. భయ్యా కాస్త కెమెరా దూరం పెట్టవా అంటూ నసిగాడు. దీంతో ఈ ప్రాంక్ తతంగాన్ని అంతా వేరే రూమ్‌లో లైవ్‌గా చూస్తూ చాహల్, పడిక్కల్, కరియప్ప తెగ నవ్వారు. ఇక ప్రసీద్ చేత కన్ను కొట్టించారు. అలాగే అతను వికెట్ తీసుకున్నప్పుడు ఎలాగైతే సెలబ్రేషన్స్ చేస్తాడో అలా అరవాలంటూ మూడు నాలుగు సార్లు రీటేక్‌లు తీశారు.
ఇక చివర్లో ప్రసీద్ చేత కేజీఎఫ్ డైలాగ్ చెప్పించారు. వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ ఐ డోన్ట్ లైక్, ఐ అవయిడ్, బట్ వైలెన్స్ లైక్స్ మీ అనే డైలగ్‌ను ప్రసీద్ సూపర్బ్‌గా చెప్పాడు. ఇక కాసేపటి తరవాత చాహల్, పడిక్కల్, కరియప్ప గది నుంచి బయటకు వచ్చి.. ఈ ఫోటోషూట్ అంత ఉత్తి సెటప్ అని నీ మీద ప్రాంక్ చేశామని ప్రసీద్‌కు చెప్పారు. ఇక ప్రసీద్ కాస్త వెర్రిమొహం పెట్టినా తను కూడా ఈ ప్రాంక్ ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు. ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ వీడియోకు మంచి వ్యూస్ వచ్చాయి.
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తన ఆటతో ఆకట్టుకుంటోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సారథ్యంలో సమిష్టిగా జట్టు రాణిస్తోంది. ఇక ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ హోల్డర్‌లుగా ఆర్ఆర్ ప్లేయర్లే ఉన్నారు. జోస్ బట్లర్ (627 పరుగులు) ఆరెంజ్ క్యాప్ కలిగి ఉండగా, చాహల్ (24 వికెట్లు) పర్పుల్ క్యాప్ కలిగి ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్ మే 20న ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ప్లేఆఫ్ బెర్త్ కన్ఫం కావడానికి రాయల్స్‌కు ఒక విజయం అవసరం.