అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్‌ను తాజా స్టాటటిక్స్ ప్రకారం రాజస్ధాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కైవసం చేసుకున్నాడు. ఇప్పటి వరకు స్టీవ్ స్మిత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 122 పరుగులు చేసి, టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటాగాడిగా మొదటి స్ధానంలో ఉన్నారు.
ఇక రాజస్ధాన్ రాయల్స్ వరుస విజయాలతో ఈ ఐపీఎల్‌లో దూసుకుపోతుంది. ఈ విజయాల్లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మంగళవారం నాడు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 79 పరుగులు సాధించి, రాజస్ధాన్ జట్టుకి విజయాన్ని అందించాడు.

ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ రాజస్ధాన్ రాయల్స్‌కి వరుసగా మూడో విజయాన్ని అందించాడు. వరుసగా పంజాబ్, ఢిల్లీపై గెలుపొందిన రాజస్థాన్‌కు ఇది మూడో గెలుపు. ముంబై మ్యాచ్ అనంతరం స్టీవ్ స్మిత్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ప్రత్యర్ధి జట్లను చిత్తు చేయడంలో స్టీవ్ స్మిత్ వ్యూహాలు ఫలిస్తున్నాయి.
ఈ మ్యాచ్‌లో స్మిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. రాజస్ధాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది.