Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Riyan Parag: గెలిచిన ఆనందం లేకపాయె.. రియాన్ పరాగ్‌కు బీసీసీఐ బిగ్ షాక్!

Riyan Parag: గౌహతిలోని బర్సపారా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు మ్యాచ్ లలో ఓడిన రాజస్థాన్ జట్టు.. సీఎస్కేపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ఖాతా తెరిచింది. కానీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ కు మాత్రం బిగ్ షాక్ తగిలింది. మ్యాచ్ జరిగిన కొన్ని గంటల తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ పై బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది.

రియాన్ పరాగ్ కు జరిమానా..

ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధన 2.22 కింద ఈ జరిమానా విధించబడింది. ఈ నియమం ప్రకారం స్లో ఓవర్ రేట్ కు జరిమానాలు విధించే నిబంధన ఉంది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ చేసిన మొదటి తప్పు కాబట్టి రియాన్ పరాగ్ కు జరిమానా మాత్రమే విధించబడింది. మరోసారి ఇలాగే జరిగితే ఓ మ్యాచ్ లో నిషేధాన్ని విధిస్తారు. ఈ సీజన్ లో జరిమానా విధించబడిన రెండో కెప్టెన్ రియాన్ పరాగ్. ఇటీవలే ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్థిక్ పాండ్యాకు కూడా ఇలాంటి జరిమానానే విధించారు.

Rajasthan Royals Captain Riyan Parag Fined for Slow Over rate in IPL 2025 Match

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.మరోసారి ఇలాగే జరిగితే ఒక ఆటపై నిషేధాన్ని విధించడంతో పాటు ఆటగాడి పాయింట్లు తగ్గిస్తారు. ముంబై కెప్టెన్ హార్దిక్ కూడా ఇటీవలే జరిమానాకు గురైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. 2024 సీజన్ లో రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ సీజన్ తొలి మ్యాచ్ లో కెప్టెన్సీ బ్యాన్ కు హార్దిక్ పాండ్యా గురయ్యాడు. కాగా.. స్లోఓవర్ రేట్ వల్ల కెప్టెన్సీపై నిషేదం విధించడాన్ని 2025 సీజన్ లో బీసీసీఐ తొలగించింది. ఇప్పుడు కెప్టెన్లను మ్యాచ్ నుంచి నిషేధించరు. తప్పు తీవ్రతను బట్టి వారికి డీమెరిట్ పాయింట్లు లభిస్తాయి.

పరాగ్ అద్భుతమైన క్యాచ్

సీఎస్కేతో మ్యాచ్ లో రియాన్ పరాగ్ ఓ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. శివమ్ దూబే బలంగా బంతిని కొట్టగా.. రియాన్ పరాగ్ డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో 10 బంతుల్లో 18 పరుగులు చేసి జోరు మీదున్న శివమ్ దూబే పెవిలియన్ చేరాడు. రియాన్ పరాగ్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ రాజస్థాన్ రాయల్స్ పరిస్థితిని మార్చివేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా 36 బంతుల్లోనే 81 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. రియాన్ పరాగ్ 28 బంతుల్లో 37 పరుగులతో కాస్త రాణించాడు. లక్ష్యఛేదనలో సీఎస్కే తడబడింది. 20 ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.

Story first published: Monday, March 31, 2025, 13:15 [IST]
Other articles published on Mar 31, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+