మెరిసిన ఆంధ్ర వేణుగోపాల్ రావు: అయినా డెవిల్స్‌కు తప్పని ఓటమి

డేవిడ్ వార్నర్ (54; 44 బంతుల్లో 6X4, 1X6), వేణుగోపాలరావు (60; 40 బంతుల్లో 4X4, 4X6) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 151 పరుగులు చేయగా, రాజస్థాన్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్ ద్రవిడ్ (38; 31 బంతుల్లో 6X4, 1X6), జొహాన్ బోథా (39 నాటౌట్; 32 బంతుల్లో 4X4)ల సమయోచిత ఇన్నింగ్స్‌లకు అశోక్ మినారియా (22; 15 బంతుల్లో 3X6), రాస్ టేలర్ (18 నాటౌట్; 10 బంతుల్లో 1X4, 1X6) మెరుపులు తోడవటంతో రాజస్థాన్ విజయం నల్లేరుపై నడకలా సాగింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీని టెయిట్ (2/40) గడగడలాడించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికే సెహ్వాగ్ (4)ను పెవిలియన్‌కు పంపాడు. తానెదుర్కొన్న మొదటి బంతిని బౌండరీగా మలిచి ఊపుమీద కనిపించిన సెహ్వాగ్ తర్వాతి బంతికే ఫస్ట్‌స్లిప్‌లో ద్రవిడ్ చేతికి చిక్కాడు. ఫించ్ (11) టెయిట్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఆ వెంటనే వార్న్ (2/17) మాయాజాలం ఆరంభమైంది. మొదటి బంతికే చాంద్ (2)ను, మూడో బంతికి నమన్ ఓజా (0)ను ఔట్ చేసి ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు.
రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఓపెనర్ వార్నర్, వేణుగోపాలరావు 11వ ఓవర్ నుంచి జూలు విదిల్చారు. ఎవరికి స్త్ట్రెక్ దొరికితే వాళ్ళు బాదారు. వార్నర్, వేణు పరుగులు రాబట్టడంలో పోటీపడ్డారు. బోథా ఓవర్లో భారీ సిక్సర్‌తో వేణు పరుగుల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ ఓవర్లో 11 పరుగులు రాగా, టెయిట్ వేసిన 16వ ఓవర్లో 17 పరుగులు పిండుకున్నారు. అర్ధసెంచరీ చేసిన వార్నర్ భారీషాట్‌కు ప్రయత్నించి ఔటవడంతో 83 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వేణు మాత్రం తన దూకుడును మరింత పెంచాడు. త్రివేది బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వేణు తర్వాతి బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా స్టాండ్స్‌లోకి తరలించాడు. అదే ఓవర్లో మరో షాట్‌కు ప్రయత్నించి వార్న్ చేతికి చిక్కాడు. 20వ ఓవర్ చివరి రెండు బంతుల్ని ఇర్ఫాన్ పఠాన్ (9 నాటౌట్; 6 బంతుల్లో 2X4) బౌండరీలుగా మలచడంతో ఢిల్లీ 150 పరుగుల మైలురాయిని అధిగమించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications