ఎలెక్షన్స్.. రాజస్థాన్ రాయల్స్‌ ఒక్కటే.. రెండూ ఐదేళ్లకే.! పింకీలను కలవరపెడుతున్న సెంటిమెంట్!

హైదరాబాద్: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిన సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్.. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. ఫస్ట్ మ్యాచ్‌లో ఓడినా కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ సెంచరీతో ఆశలు రేకెత్తించిన పింక్ ఆర్మీ.. తర్వాత రూ.16.25 కోట్ల ఆటగాడైన క్రిస్ మోరీస్ సూపర్ సిక్స్‌లతో ఢిల్లీపై థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది. కానీ ఆ గెలుపు జోరును కొనసాగించలేక చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడింది.

ఇక గురువారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ సమష్టిగా విఫలమై 10 వికెట్ల తేడాతో ఘోరపరాభావాన్ని మూటగట్టుకుంది. అయితే 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ ఎలెక్షన్స్ మాదిరి ఐదేళ్లకోసారి రాణించడం గమనార్హం. ప్రస్తుతం ఈ సెంటిమెంటే సంజూ శాంసన్ టీమ్‌ను కలవరపెడుతోంది.

ఐదేళ్ల కోసారి ప్లే ఆఫ్‌కు..

ఐదేళ్ల కోసారి ప్లే ఆఫ్‌కు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అరంగేట్ర సీజన్‌(2008)లో ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. క్రికెట్‌‌ బ్యాడ్‌‌బాయ్‌‌ షేన్‌‌ వార్న్‌‌ అద్భుతాలు చేయడంతో.. టైటిల్‌‌ను ఎగరేసుకుపోయింది. ఇక ఆనాటి నుంచి నేటి వరకు లీగ్‌‌లో అనామక జట్టుగానే కొనసాగుతున్నది..! సీజన్లు గడుస్తున్నా.. ప్లేయర్లు మారుతున్నా.. రాయల్స్‌‌ రాత మాత్రం మారలేదు. ఆ టైటిల్ తర్వాత రాజస్థాన్ కేవలం రెండే సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. అది కూడా టైటిల్ గెలిచిన ఐదేళ్లకు 2013లో.. ఆ తర్వాత మరో ఐదేళ్లకు 2018 సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది.

PBKS vs MI: కృనాల్ పాండ్యా X దీపక్ హుడా దంచికొట్టేదెవరో? పంజాబ్ జట్టులోకి ఆ సూపర్ బౌలర్ .. తుది జట్లు ఇవే!

2013లో క్వాలిఫయర్-2..

2013లో క్వాలిఫయర్-2..

2013 సీజన్‌ లీగ్ దశలో దుమ్మురేపిన రాజస్థాన్ 16 మ్యాచ్‌లకు 10 విజయాలతో టాప్-3లో నిలిచి ఫ్లే ఆప్స్ చేరింది. అనంతరం ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన రాజస్థాన్.. అనంతరం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో అదే 4 వికెట్ల తేడాతో ఓడి ఇంటిదారిపట్టింది. ఇక ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబై.. తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ సీజన్ ‌అనంతరం మరో ఐదేళ్ల వరకు రాజస్థాన్ మెరుగైన ప్రదర్శన కనబర్చలేదు. 2014లో ఐదో స్థానంతో సరిపెట్టుకున్న ఆ జట్టు.. 2015లో మరోసారి ప్లే ఆఫ్స్ చేరింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత ఫిక్సింగ్ ఉదంతంతో రెండేళ్లపాటు వేటుకుగురైంది.

రీఎంట్రీలో అదరగొట్టి..

రీఎంట్రీలో అదరగొట్టి..

2018 సీజన్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్.. 14 లీగ్‌ మ్యాచ్‌ల్లో 8 గెలిచి పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో నిలిచింది. కానీ కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 25 రన్స్ తేడాతో ఓడి ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించిన చెన్నై మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. 2019 సీజన్‌లో దారుణంగా విఫలమైన రాజస్థాన్ 14 లీగ్ మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచి ఏడో స్థానంలో నిలిచింది. ఇక యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన రాజస్థాన్.. చిట్టచివర నిలిచింది. 14 మ్యాచ్‌లకు 6 గెలిచినా అట్టడుగున నిలిచి అప్రతిష్టను మూటగట్టుకుంది.

Delhi Capitals ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ఆ స్టార్ ఆల్‌రౌండర్ రెడీ!

2021లో అదే వైఫల్యం..

2021లో అదే వైఫల్యం..

ఎన్నికల మాదిరే ఐదేళ్లకోసారి ఆ జట్టు రాణించడం ఇప్పుడు ఆ జట్టు ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. ఈ సెంటిమెంట్ ప్రకారం 2023 వరకు ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరే చాన్స్ లేదు. దానికి తగ్గట్లే ఈ సీజన్‌లో ఆ జట్టు ఆటతీరు కొనసాగుతోంది. ఆటగాళ్ల వైఫల్యాలకు తోడు గాయాలు కూడా ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే తమ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ దూరమవడం.. విధ్వంసకర ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఫస్ట్ మ్యాచ్‌లోనే గాయపడి జట్టును వీడటం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడుం ఆ జట్టంతా కెప్టెన్ సంజూ శాంసన్, సీనియర్ ప్లేయర్స్ జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్‌లపైనే ఆధారపడి ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, April 23, 2021, 17:04 [IST]
Other articles published on Apr 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X