Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RRvsDC : బట్లర్ లేని రాజస్థాన్.. బలం సరిపోతుందా?.. ఢిల్లీని ఢీకొట్టే జట్టు ఇదే!

గతేడాది రాజస్థాన్ రాయల్స్ ఏకంగా ఐపీఎల్ ఫైనల్ చేరింది. దీనిలో ఓపెనర్ జోస్ బట్లర్ పాత్ర చాలా కీలకం. గత ఐపీఎల్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను.. ఒంటి చేత్తో రాజస్థాన్‌ను ఫైనల్ చేర్చాడని చెప్పొచ్చు. ఈ ఏడాది కూడా బట్లర్ బాగానే ఆడాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. అయితే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని చేతికి గాయమైంది.

ఈ గాయం వల్లనే అతను ఆ మ్యాచ్ ఛేజింగ్‌లో ఓపెనింగ్ చేయడానికి రాలేదు. అతని స్థానంలో వచ్చిన అశ్విన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో బరిలో దిగాడు. చెయ్యి నొప్పిగా ఉన్నా చక్కగా బ్యాటింగ్ చేసిన అతను నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతని చేతి వేలికి గాయమవగా.. దానికి కుట్లు వేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారట. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బట్లర్ ఆడటం అనుమానంగా మారింది.

rajasthan royals team

ఐపీఎల్ చరిత్రలో 999వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. బట్లర్ లేకపోతే అతని స్థానంలో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. లేదంటే పంజాబ్ మ్యాచ్‌లో ఆడినట్లే నొప్పి ఉన్నా బట్లర్‌నే ఆడించే అవకాశం కూడా ఉంది. అలాగే రెండు మ్యాచుల్లో విఫలమైన దేవదత్ పడిక్కల్‌ను రాజస్థాన్ పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆకట్టుకున్న ధృవ్ జురెల్‌కు అవకాశం దక్కొచ్చు.

అదే జరిగితే రియాన్ పరాగ్‌ కూడా తన ఫేవరెట్ నాలుగో నెంబర్‌లో ఆడే అవకాశం ఉంటుంది. రియాన్ పరాగ్‌ను నాలుగో నెంబర్‌లో పంపితే.. జురెల్ ఫినిషర్‌గా తన పని చేసుకుంటాడు. దేవదత్ పడిక్కల్‌ను సబ్‌స్టిట్యూట్ జాబితాలో చేర్చే ఛాన్స్ ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. కేఎమ్ ఆసిఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. దానికితోడు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ఈ క్రమంలో అతన్ని ఈ మ్యాచ్‌లో కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్ (అంచనా): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధృవ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, కేఎం ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

ఇంపాక్ట్ ప్లేయర్ అభ్యర్థులు: దేవదత్ పడిక్కల్, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, నవదీప్ సైనీ

Story first published: Saturday, April 8, 2023, 11:16 [IST]
Other articles published on Apr 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+