
రూ.50 లక్షలకు తీసుకున్న రాజస్థాన్..
ఈ సీజన్ వేలంలో రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌కు థామస్‌ను రాజస్థాన్ కొనుగోలు చేసింది. గత సీజన్లో ఇదే రాజస్థాన్ ఈ ఆరడుగుల ఆజానుభావునికి అత్యధికంగా రూ.1.5 కోట్లు చెల్లించింది. ఆ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన థామస్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ 2/6 గణంకాలు నమోదు చేశాడు. ఇక అతను రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఈ సీజన్లో పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి.
ద్రవిడ్ కొడుకా.. మజాకా.. 2నెలల్లో 2 డబుల్ సెంచరీలు!!

స్కానింగ్‌లో ఏదైనా ..
ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభంకానుండగా.. అప్పటిలోపు థామస్ ఫిట్నెస్ సాధిస్తాడని అతని సన్నిహితులు చెప్తున్నారు. ప్రమాదంపై చికిత్స తీసుకుని ఈ పేసర్ డిశ్చార్జ్ అయినప్పటికీ.. త్వరలోనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ స్కానింగ్‌లో ఏదైనా తీవ్ర గాయం ఉన్నట్లు తేలితే..? ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకి ఈ పేసర్ దూరమయ్యే ప్రమాదం ఉంది.

ఇప్పటికే ఆర్చర్ దూరం..
టైటిలే లక్ష్యంగా ఈ ఐపీఎల్ సీజన్‌కు సిద్ధమవుతున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా ఈ స్టార్ పేసర్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గత సీజన్లో జోఫ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఓవర్‌కు 6.76 పరుగుల చొప్పున ఇచ్చి 11 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని అద్భుత బౌలింగ్ జట్టు విజయాలకు కలిసొచ్చింది. దీంతో ఆర్చర్‌ను ఈ సీజన్‌కు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. మరోసారి అతని నుంచి అదే ప్రదర్శనను ఆశించింది. కానీ టోర్నీ మొదలవ్వకుండానే గాయంతో ఆర్చర్ సేవలను కోల్పోయింది. ఇప్పుడు తాజాగా థామస్ సేవలను కోల్పోనుంది.

భారత్‌పై అరంగేట్రం..
2018లో గువహతి వేదికగా జరిగిన వన్డేతోనే థామస్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన థామస్‌కు ఆ తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లిన జట్టులో చోటు లభించలేదు. ఇప్పటి వరకూ వెస్టిండీస్ తరఫున 20 వన్డేలాడిన ఈ పేసర్ 27 వికెట్లు పడగొట్టాడు. 10 టీ20 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ ముంగిట థామస్ గాయపడటం విండీస్ జట్టను కూడా కలవరపెడుతోంది.