Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తన తొలి టెస్టులో రైనా సెంచరీ: ఫాలో ఆన్ తప్పించుకున్న ఇండియా

Suresh Raina
కొలంబో: భారత బ్యాట్స్ మన్ సురేష్ రైనా అద్భుతమైన ప్రదర్శన చేసి తాను ఆడుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించాడు. శ్రీలంకపై జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు గురువారం అతను సెంచరీ చేశాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లలో రైనా తొమ్మిదో వాడిగా రికార్డు సృష్టించాడు. గురువారం ఉదయం ఆట ప్రారంభమైన తర్వాత రైనా, సచిన్ టెండూల్కర్ నిలకడగా ఆడి భారత్ ను ఆదుకున్నారు.

ఉదయం నాలుగో ఓవర్ పూర్తయ్యే సరికి వారిద్దరి జోడి భారత స్కోరును 400 పరుగులకు చేర్చారు. ఈ జోడీ 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రీలంక తొలి ఇన్నింగ్సు స్కోరును సమం చేయడానికి భారత్ ఇంకా 260 పరుగులు చేయాల్సి ఉంటుంది. శ్రీలంక చేసిన 642 పరుగుల భారీ స్కోరును ఎదుర్కోవడానికి బుధవారం తొలి ఇన్నింగ్సును ప్రారంభించిన భారత్ 382 పరుగులకే నాలుగు ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. సచిన్ టెండూల్కర్ బుధవారం టెస్టుల్లో తన 48వ సెంచరీని నమోదు చేసుకున్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+