న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ లైన్స్ కెప్టెన్‌గా ఉన్న సురేశ్ రైనా తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌ని మిస్ కానున్నాడు. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ ఎడిషన్‌లలో రైనా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకపోవడం విశేషం. అయితే శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్‌ను మిస్ అయ్యాడు.
సురేశ్ రైనా లేకుండానే ఈరోజు మ్యాచ్ జరగుతోంది. భారత్‌లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి సురేశ్ రైనా ఏ ఫ్రాంజైకి ఆడినా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు. అయితే గర్భిణి అయిన తన భార్య ప్రియాంకను కలిసేందుకు నెదర్లాండ్స్‌కు వెళ్లాడు. శనివారం లేదా ఆదివారం రైనా భార్య ప్రసవించనుంది.

ఎప్పుడెప్పుడు తండ్రువుతానా అని ఉత్సాహంగా ఎదురుచూస్తోన్న సురేశ్ రైనా తన భార్య ప్రియాంక చౌధురితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్‌లో ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పటి వరకు 143 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రైనా అందులో 132 మ్యాచ్‌లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడటం విశేషం.
కాగా, ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై, రాజస్థాన్ జట్లు వైదొలగగా వాటి స్థానంలో 9వ ఎడిషన్‌లో పూణె, గుజరాత్ జట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్ లైన్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్న సురేశ్ రైనా ఆ జట్టు తరుపున 11 మ్యాచ్‌లు ఆడాడు. మే 19న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు రైనా రానున్నాడు.