150: ఐపీఎల్‌లో సురేశ్ రైనా అరుదైన రికార్డు
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్ కెప్టెన్ ఓ అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మ్యాచ్‌లాడిన ఆటగాడిగా సురేశ్ రైనా అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.
గత తొమ్మిది సీజన్ల వరకు 147 మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా ఐపీఎల్ పదో సీజన్‌లో శుక్రవారం వరకు మూడు మ్యాచ్‌లాడాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధికంగా 150 మ్యాచ్‌లాడిన ఆటగాడిగా సురేశ్ రైనా అరుదైన రికార్డు సృష్టించాడు.

2008లో ఐపీఎల్ అరంగేట్రం
2008లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సురేశ్ రైనా ఆ సీజన్‌లో 16మ్యాచ్‌లు ఆడాడు. ధోని నేతృత్వంలోని చెన్నై జట్టులో 2015 వరకు రైనా ఆడాడు. ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే.

2016లో గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్‌గా
ఆ తర్వాత 2016లో గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్‌గా సురేశ్ రైనా ఎంపికయ్యాడు. 2016లో లీగ్ పూర్తయ్యే నాటికి గుజరాత్ లయన్స్‌ని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లాడిన సురేశ్ రైనా 4,206 పరుగులు సాధించాడు.

2013 ఐపీఎల్లో అత్యధికంగా 548 పరుగులు
2013 ఐపీఎల్లో అత్యధికంగా 548 పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2010లో మూడు మ్యాచ్‌లకు ధోనీ అందుబాటులో లేకపోవడంతో చెన్నై జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అదే ఏడాది 16 మ్యాచ్‌లు ఆడిన రైనా 520 పరుగులు సాధించాడు.

రైనా తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ
ఇక రైనా తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ 147, కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ 135 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్ పదో సీజన్‌లో గుజరాత్ లయన్స్ మూడు మ్యాచ్‌లాడి ఒక విజయం సాధించగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ జట్టు ముంబైతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications