Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : మూడో వన్డేకు వర్షం ముప్పు!.. భారీ స్కోర్లు కూడా కష్టమే..!

Rain will effect INDvsAUS ODI series decider

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీసులో నిర్ణయాత్మక మూడో వన్డేకు సమయం దగ్గరపడింది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు పొంచి ఉండటం అభిమానుల్లో టెన్షన్ పడుతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మూడో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో మిడిలార్డర్ పోరాటంతో భారత్ నెగ్గగా.. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘోరంగా ఓడింది. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో నిప్పులు చెరగడంతో భారత బ్యాటింగ్ కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లే బాదేశారు.

పొంచి ఉన్న వర్షం ముప్పు!

పొంచి ఉన్న వర్షం ముప్పు!

దీంతో మూడో వన్డేలో కూడా ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు చాలా ఉన్నాయని సమాచారం. చెపాక్‌లో సరిగ్గా మ్యాచ్ మొదలవడానికి ముందు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్తోంది. అంతేకాదు, మ్యాచ్ జరుగుతున్న మధ్యలో మరోసారి వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా. ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంటుందని తెలుస్తోంది. అంటే ఏ క్షణమైనా వర్షం మొదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే నెమ్మదిగా మబ్బులు వీడిపోతాయని, అదే జరిగితే వర్షం ఉండదని సమాచారం.

ఛేజింగ్ చేస్తే బెటర్..

ఛేజింగ్ చేస్తే బెటర్..

అలాగే ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. గాలిలో తేమ సాయంత్రానికి 85 శాతం వరకు చేరుకుటుందట. ఇక పిచ్ విషయానికొస్తే.. చెన్నైలోని పిచ్ సాధారణంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇద్దరికీ సహకారం అందుతుంది. అయితే ఈ పిచ్ స్లోగా ఉండటంతో స్పిన్నర్లు చాలా కీలకం అవుతారని నిపుణుల అంచనా. ఈ పిచ్‌పై జరిగిన 21 మ్యాచుల్లో సగటు స్కోరు 259 పరుగులు. మ్యాచ్ జరిగే కొద్దీ ఈ పిచ్ చాలా డ్రైగా, స్లోగా ఉండటంతో ఛేజింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందని రికార్డులు చెప్తున్నాయి. అయితే ఇక్కడ జరిగిన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం ఈ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది.

చివరి వన్డేలో తారుమారు..

చివరి వన్డేలో తారుమారు..

ఈ వేదికలో చివరగా జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్, భారత్ తలపడ్డాయి. 2019లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 288 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో టీమిండియా సునాయాసంగా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఫ్లడ్ లైట్ల వెలుగులో పిచ్ కొంచెం వేగంగా మారింది. దీంతో విండీస్ బ్యాటర్లు చెలరేగారు. ఈ క్రమంలోనే ఎనిమిది వికెట్లు కోల్పోయిన విండీస్.. మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు షాకిచ్చింది. కాబట్టి ఈ పిచ్‌పై ఛేజింగ్ టీం ఓడిపోతుందని కచ్చితంగా చెప్పలేం.

భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

Story first published: Wednesday, March 22, 2023, 9:09 [IST]
Other articles published on Mar 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+