Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు (Video)

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రేపటి నుంచి బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ అర్హతకు అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం కానుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో భారత్ అగ్రస్థానంలో ఉంది.

మరోవైపు శ్రీలంక పర్యటనలో ఘోరపరాజయం చవిచూసిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌‌ను అయినా దక్కించుకోవాలని పట్టుదలతో సన్నద్ధమవుతోంది. భారత గడ్డపై ఇప్పటివరకు న్యూజిలాండ్ ఒక్కసారి కూడా వన్డే, టెస్టు సిరీస్ గెలవలేదు. మొత్తంగా ఇప్పటివరకు ఇరు జట్లు 62 టెస్టుల్లో తలపడగా భారత్‌ 22, న్యూజిలాండ్‌ 13 గెలిచాయి. 27 టెస్టులు డ్రాగా ముగిశాయి. అయితే బెంగళూరు టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడు.

Rain Washes Out India s Training Session Ahead of Bengaluru Test Against New Zealand

మంగళవారం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దయింది. వాస్తవానికి ఇవాళ ఉదయం 9.30 గంటకలు భారత్ ప్రాక్టీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం పడటంతో ప్రాక్టీస్‌ను గంటపాటు వాయిదా వేశారు. అప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రాక్టీస్ సెషన్‌ను పూర్తిగా రద్దు చేశారు. న్యూజిలాండ్ ప్రాక్టీస్ సెషన్ మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలుకానుంది. అయితే వరుణుడు ప్రతాపం చూస్తుంటే కివీస్ సాధన కూడా అనుమానమే అన్నట్లుగా అనిపిస్తోంది.

అసలు తొలి టెస్టు సజావుగా సాగడం అనుమానమే. వారం రోజుల పాటు వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆటలో తొలి రోజు, రెండో రోజు 70 %, 90 % వరుసగా వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. సోమవారం రాత్రి కూడా వర్షం కురిసింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ కలదు. వరుణుడు కాస్త కరుణించినా మ్యాచ్‌ను నిర్వహించేలా ప్రయత్నించాలని మైదాన సిబ్బంది సిద్ధంగా ఉంది.

Story first published: Tuesday, October 15, 2024, 13:22 [IST]
Other articles published on Oct 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+