Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై-ముంబై ఫైనల్‌కు వరణుడి ముప్పు

కోల్‌కతా: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచివుంది. ఆదివారం జరగనున్న మ్యాచులో ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది.

శనివారం ఇక్కడ వాతావరణ శాఖ ప్రాంతీయ అధికారి మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా తోపాటు పలు ప్రాంతాల్లో వచ్చే రెండు మూడు రోజులు వర్షం పడే అవకాశాలున్నాయని తెలిపారు. రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

'రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో వర్షం కురుస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. కోల్‌కతాలో కూడా వర్షం పడే అవకాశం లేకపోలేదు' అని ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం వర్షానికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంందని చెప్పారు.

Rain threat over CSK-MI IPL 2015 final in Kolkata

దక్షిణ బెంగాల్‌లోని బుర్ద్వాన్, బంకురా జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని చెప్పారు. కోల్‌కతాలో కూడా 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశముందని తెలిపారు. అయితే ఆదివారం నుంచి వాతావరణం కొంత చల్లగా ఉండే అవకాశముందని చెప్పారు.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఫైనల్ మ్యాచుకు వర్షం స్వాగతం పలుకుతుందో లేదో వేచి చూడాలి. ఈ ఐపిఎల్ ప్రారంభం వేడుకల సందర్భంలోనూ కాసేపు వర్షం కురిసి తర్వాత విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇక్కడా జరిగితే అభిమానులు మ్యాచును వీక్షించే అవకాశం ఉంటుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+