ఈడెన్‌లో ఆసీస్‌తో రెండో వన్డే: వరుణుడు కరుణించేనా?
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య కోల్‌కతా వేదికగా గురువారం జరగాల్సిన రెండో వన్డే జరుగుతుందా? లేదా అనే అనుమానం కలుగుతోంది. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో భారీ వర్షాలు ముంచెత్తడమే ఇందుకు కారణం.

రెండో వన్డేపై వరుణుడు ప్రభావం
అటు ముంబైతో పాటు ఇటు కోల్‌కతాను కూడా వర్షాలు కుదుపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న రెండో వన్డేపై వరుణుడు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరోవైపు వర్షాల కారణంగా రెండు జట్లు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు.

వర్షం కారణంగా కోహ్లీసేన ప్రాక్టీస్ రద్దు
వర్షం కారణంగా బుధవారం కోహ్లీసేన ప్రాక్టీస్ రద్దు చేసుకొంది. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇండోర్‌కే పరిమితమైంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు ఈడెన్‌లో అత్యున్నత సాంకేతిక సౌకర్యాలు ఏర్పాటు చేశామని, మ్యాచ్‌ను నిర్వహిస్తామని క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు.

మబ్బులు వీడి ప్రకాశించిన సూర్యుడు
అంతేకాదు బుధవారం సాయంత్రానికి మబ్బులు వీడి సూర్యుడు వచ్చాడు. ఎండ వచ్చినందుకు క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆనందం వ్యక్తం చేశారు. అక్కడక్కడా గురువారం చిరు జల్లులు పడే అవకాశం ఉన్నా మధ్యాహ్నం సూర్యుని వెలుగు చూస్తామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

పిచ్‌ను పరిశీలించిన రవి శాస్త్రి, కోహ్లీ
మరోవైపు పిచ్‌పై ఉంచిన కవర్లు తొలగించడంతో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పిచ్‌ను పరిశీలించారు. పిచ్‌పై పచ్చిక ఉంది. తొలి వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో ముందంజ వేసిన కోహ్లీసేనను రెండో వన్డేలో విజయం సాధించి ద్వారా ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని, తద్వారా సిరీస్ పై పూర్తి పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications