
వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా క్వీన్ పార్క్ ఓవల్‌లో జరగనున్న చివరి వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భారత్ తహతహలాడుతుండగా.. ఆట మధ్యలో వరుణుడు బ్రేకులేశాడు. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ శిఖర్ ధావన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఓపెనర్లుగా గబ్బర్, గిల్ క్రీజులో దిగి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 113పరుగుల ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చారు. అయితే కుదురుకున్న తర్వాత కూడా వీరిద్దరూ ధాటిగా ఆడలేకపోయారు. ఇక వర్షం కారణంగా ఆట ఆగిపోయే కొద్ది సేపు ముందు హాఫ్ సెంచరీ చేసిన ధావన్ (74బంతుల్లో 7ఫోర్లతో 58పరుగులు) హైడెన్ వాల్స్ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు.
ఇక ధావన్ ఔటయినప్పటికీ క్రీజులో శుభ్ మన్ గిల్ (65బంతుల్లో 51పరగులు 3ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) హాఫ్ సెంచరీ చేసి నిలదొక్కుకున్నాడు. ఇక అతనితో పాటు శ్రేయస్ అయ్యర్ (2పరుగులు నాటౌట్) ఉన్నారు. ఇక 24ఓవర్లకు 115పరుగుల వద్ద మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం కలిగింది. ఇక వర్షం కాసేపటికి తగ్గితే ఓవర్లు కుదించి డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం మ్యాచ్ నిర్వహించే వీలుంది. అదే జరిగితే వెస్టిండీస్‌కు కాస్త బెనిఫిట్ ఉంటుంది.
పైగా భారత స్పిన్నర్లు సైతం బంతిపై గ్రిప్ కోల్పోతారు. ఏదేమైనా వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితేనే బెటర్ ఎందుకంటే.. ఇండియా రన్ రేట్ చాలా తక్కువగా ఉండడంతో.. వెస్టిండీస్‌కు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం తక్కువ టార్గెటే వస్తుంది. తద్వారా ఆ జట్టుకు అన్ని విధాల బెటర్ విన్నింగ్ అవకాశాలుంటాయి.
తుది జట్లు:
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కీసీ కార్తీ, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, కీమో పాల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, జేడెన్ సీల్స్
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ