Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: మెల్‌బోర్న్ టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసి వరుసగా ఆ ఘనతను మూడుసార్లు సాధించిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

పాకిస్థాన్‌తో మెల్ బోర్న్‌లో జరుగుతున్న రెండో టెస్టులో 168 బంతులను ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ 17 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 17వ సెంచ‌రీ. తద్వారా 2016లో టెస్టుల్లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా 2014, 2015లలో కూడా స్మిత్ టెస్టుల్లో 1000కి పైగా పరుగులు సాధించాడు.

మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు

మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు

గతంలో వెస్టిండిస్‌కు చెందిన బ్రియాన్ లారా, ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ట్రెస్కోథిక్ మాత్రమే వరుసగా మూడుసార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ ఐదు కేలండర్ ఇయర్‌లలో వరుసగా వెయ్యి పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు.

రెండు బాక్సింగ్ డే టెస్టులు కలిపి స్మిత్ 410

రెండు బాక్సింగ్ డే టెస్టులు కలిపి స్మిత్ 410

ఇదిలా ఉంటే 2014లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్‌పై 192, 14 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, 2015లో వెస్టిండిస్‌పై 134, 70 పరుగులు చేశాడు. తద్వారా రెండు బాక్సింగ్ డే టెస్టులు కలిపి స్మిత్ 410 పరుగులు చేయడం విశేషం. వర్షం కారణంగా రెండో టెస్టుకి పలుమార్లు అంతరాయం ఏర్పడింది.

తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసిన పాకిస్థాన్

తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసిన పాకిస్థాన్

రెండో టెస్టులో పాకిస్థాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీని చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ అర్ధసెంచరీలను నమోదు చేశారు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ సాధించడంతో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు.

ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 465 పరుగులు

ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 465 పరుగులు

అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 465 పరుగుల వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 144 పరుగులతో సెంచరీ చేయగా, ఆ తర్వాత స్టీవ్ స్మిత్(100 నాటౌట్)తో క్రీజులో ఉన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+