PAK vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు తన చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రావల్పిండి స్టేడియంలో జరుగుతోంది. ఇరు జట్లు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. నేడు రెండు జట్లు తమ పరువు కోసం పోరాడనున్నాయి. ఆతిథ్య జట్టుగా ఉండి అవమానకర రీతిలో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్.. బంగ్లాతో జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది.
ఇదిలా ఉండగా.. రావల్పిండి వేదికగా జరగాల్సిన పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం ఆగినప్పటికీ మైదానం తడిగా ఉండడంతో టాస్ ఆలస్యం కానుంది. ఛాంపియన్స్ టోర్నీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయాయి. అంతకు ముందు కూడా ఈ వేదికపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

రెండు జట్లు ఇవే..
పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా (వైస్-కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది.
బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), ఎండీ మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా.