
బంతి పొడిగా ఉంటే వేరేలా ఉండేది:
మ్యాచ్ ఫలితంపై వర్షం కూడా ప్రభావం చూపిందని చెప్పాడు. వర్షం వల్ల పిచ్ స్వభావం మారిపోయిందని, అందువల్లే గత మూడు మ్యాచుల్లో బంతిని బాగా తిప్పిన తమ స్పిన్నర్లు ఈ వన్డేలో బంతిపై పట్టు కోల్పోయారని వివరించాడు. బంతి పొడిగా ఉంటే స్పిన్నర్ల ప్రదర్శన మరోలా ఉండేదని వెల్లడించాడు.

ఫ్లో మిస్ అయింది:
అలాగే, తమ బ్యాటింగ్ మంచి ఫ్లోలో వెళ్తుండగా వర్షం వచ్చి దెబ్బకొట్టిందని ధావన్ చెప్పాడు. ఆట మధ్యలో వర్షం పడటంతో తమ బ్యాటింగ్ ఫ్లో దెబ్బతిన్నదని, అయినప్పటికీ తాము మంచి స్కోరే సాధించామని వివరించాడు.

మిల్లర్ అవుట్ అయితే వేరేలా:
కానీ మళ్లీ ఇంకోసారి వర్షం పడటంతో అవుట్‌ఫీల్డ్ బాగా తడిగా మారిందని, ఇది మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని తెలిపాడు. ‘మ్యాచ్ చేజారడానికి ప్రధాన కారణం మిల్లర్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం, వెంటనే అతను బౌల్డ్ అయిన బంతి నోబాల్ కావడం. దీంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఇలా జరిగి ఉండకపోతే మేం మెరుగైన స్థితిలో ఉండేవాళ్లం' అని ధావన్ చెప్పుకొచ్చాడు.

మిల్లర్‌కి బాగా కలిసొచ్చింది:
క్యాచ్ ఇచ్చి బయటపడ్డ మిల్లర్ అప్పటికి మిల్లర్ 6 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ వెంటనే 7 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో మిల్లర్ బౌల్డ్ అయినప్పటికీ అది నోబాల్. అవకాశాలను అందిపుచ్చుకున్న మిల్లర్ 28 బంతుల్లో 39 పరుగులు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో శిఖర్ ధావన్ తన 100వ వన్డేలో చేసిన సెంచరీ వృథాగా పోయినట్లయింది.

నాలుగో వన్డేలో భారత్ పరాజయం:
భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 289 పరుగులు చేసింది. వందో వన్డే ఆడుతూ శిఖర్ ధావన్ సెంచరీ 105 బంతుల్లో 109 చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి 83 బంతుల్లో 75 మరోసారి చక్కటి బ్యాటింగ్‌తో అలరించాడు. వీళ్లిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగులు జోడించారు. వీళ్లిద్దరి భాగస్వామ్యంలో చక్కటి స్కోరును సాధిస్తారనుకున్నా.. తడబడి ఓ మోస్తరు స్కోరుతో సరిపెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











