

సౌతాంప్టన్: సహచర క్రికెటర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తే కేఎల్ రాహుల్‌కు విమర్శలు ఎదురైయ్యాయి. ఎందుకంటే అతను శుభాకాంక్షలు తెలియజేయడం కాదు పొరబాటు.. టైమింగ్‌లో జరిగింది పొరబాటు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఇంగ్లాండ్ సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో భారత్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అలా ఓడిపోయారా లేదో వెంటనే రాహుల్ ఏదో తొందర ఉన్నట్టు తన ట్విట్టర్ ద్వారా ఇషాంత్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. దీనిని నెటిజన్లు జీర్ణించుకోలేక పోయారు. ఆగ్రహంతో తమకు తెలిసిన ట్రోలింగ్ విద్యకు పనిచెప్పారు. విదేశాల్లో ఆడిన 13 ఇన్నింగ్సుల్లో 13 సగటుతో నువ్వు చేసింది 171 పరుగులే అన్నారు. కొందరేమో సిగ్గు లేదా అని, ఇంకొందరైతే ఆట వదిలేసి మోడలింగ్ చేసుకో అంటూ ట్రోల్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ సైతం రెండంకెల స్కోరు చేస్తున్నాడు కాస్త సిగ్గు తెచ్చుకో అనీ ఘాటుగా విమర్శించారు.
'అత్యంత నిజాయతీ పరుడు, నీతిపరుడు, ప్రేమించే మనిషి, ప్రతి జట్టులో ఉండాలని కోరుకునే అనుభవజ్ఞుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలి' - కేఎల్ రాహుల్
'సిగ్గనిపించడం లేదా. ట్వీట్ చేస్తున్నావ్' - ఓ అభిమాని కౌంటర్.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రాహుల్ నిజంగానే ఆకట్టుకోలేక పోయాడు. తొలి మూడు టెస్టు్ల్లో 4, 13, 8, 10, 23, 36 స్కోర్లు చేశాడు. ఇక నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 19కి, రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు చెలరేగుతున్నాయి.