INDvsAUS : మూడో టెస్టులో రాహుల్‌కు ఛాన్స్ లేదు.. తేల్చేసిన మాజీ లెజెండ్!

ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో కేఎల్ రాహుల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. అతని బ్యాటింగ్ చూసిన వాళ్లంతా విమర్శలు చేస్తున్నారు. అతన్ని జట్టులో నుంచి తొలగించి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. అయితే రాహుల్ ఈ జట్టులో వైస్ కెప్టెన్ కావడంతో అతన్ని తొలగించడం అసాధ్యంగా కనిపించింది. ఇప్పుడు సెలెక్టర్లు కూడా చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో అతన్ని వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఈ చర్చ మరింత జోరుగా సాగుతోంది.

మూడో టెస్టులో గిల్ ఖాయం?
కేఎల్ రాహుల్ విషయంపై టీమిండియా మాజీ లెజెండ్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయం వెల్లడించాడు. ఆసీస్‌తో జరిగే మూడో వన్డేలో రాహుల్ దాదాపుగా ఆడడని తేల్చేశాడు. 'ఇప్పుడు అతను వైస్ కెప్టెన్ కూడా కాదు కదా. జట్టు ప్రకటన సమయంలో రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించలేదు. దీనికి కారణం నాకు కనిపిస్తోంది ఒకటే.. తర్వాతి మ్యాచ్‌లో గిల్‌ను ఆడంచడానికి. వన్డేలు, టీ20లు అన్నింట్లో గిల్ తన ఫామ్ చూపించుకున్నాడు. తన సత్తాతో గిల్ ఇప్పుడు సూపర్ హీరో అయిపోయాడు. అందుకైనా అతనికి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా' అని భజ్జీ తేల్చేశాడు.

కాలం కలిసి రావట్లేదు..
ఇక రాహుల్ విషయానికొస్తే.. ఢిల్లీలో రెండో ఇన్నింగ్స్‌లో అతను అవుటైన తీరు చూస్తుంటే కాలం కూడా అతనికి అనుకూలంగా లేదని స్పష్టం అవుతోందని భజ్జీ చెప్పాడు. రాహుల్ మంచి క్వాలిటీ ఆటగాడని, ఒక గొప్ప ఆటగాడని ఒప్పుకున్న భజ్జీ.. కానీ రాహుల్ గణాంకాలు ఇంకా మెరుగ్గా ఉంటే బాగుండేదన్నాడు. అలాగే రాహుల్ కొంత కాలం అంతర్జాతీయ మ్యాచులకు దూరంగా ఉండాలని, దేశవాళీలు ఆడి తన ఆటకు మెరుగులు దిద్దుకోవాలని భజ్జీ సూచించాడు.

క్వాలిటీ ప్లేయరే కానీ..
అదే సమయంలో రాహుల్ చాలా సత్తా ఉన్న ఆటగాడని, ప్రపంచ క్రికెట్‌లోని టాప్ బ్యాటర్లలో ఒకడని కొనియాడాడు. అయితే ప్రస్తుతం అతనికి కొంత సమయం కావాలని చెప్పాడు. 'ఒక్క భారత్‌లోనే కాదు.. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్లలో రాహుల్ ఒకడని నేను నమ్ముతా. అందుకే చెప్తున్నా.. రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకొని, దేశవాళీలు ఆడితే మంచిది. ఆ మ్యాచుల్లో రాణించి మళ్లీ కాన్ఫిడెన్స్ పొందిన తర్వాత అతన్ని మళ్లీ తీసుకోవాలి. అతనో క్వాలిటీ ప్లేయర్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు' అని భజ్జీ తేల్చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications