Rahul Tripathi got a maiden call : రాహుల్ త్రిపాఠి అంటే ఏంటో చూపించు.. నెట్టింటా మామూలుగా లేదు క్రేజు

ఐపీఎల్ 2022 మే 29న ముగిసిన తర్వాత.. జూన్ 9నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మలిక్‌ను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. అతనితో పాటు పంజాబ్ కింగ్స్ డెత్ బౌలింగ్ స్పెషలిస్టు అర్ష్‌దీప్ సింగ్ సైతం ఎంపికయ్యాడు. వీరిద్దరు మూడు మ్యాచ్‌లలో ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జట్టుకు ఎంపికైనప్పటికీ తుది జట్టులో ఆడేందుకు వీరికి అవకాశం రాలేదు. బ్యాటింగ్లో రాణించిన సన్ రైజర్స్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని మాత్రం బీసీసీఐ ఈ సిరీస్‌కు ఎంపిక చేయకుండా మొండిచేయి చూపించింది. ఐపీఎల్లో అనూహ్యంగా రాణిస్తున్న రాహుల్ త్రిపాఠి భారత టీ20 జట్టులో తప్పకుండా స్థానం సాధిస్తాడని అభిమానులు, క్రికెట్ ప్రముఖులు సైతం భావించారు.
రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేయకపోవడంతో ట్విట్టర్లో బీసీసీఐకి నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు. ఇక తాజాగా ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించగా.. అందులో రాహుల్ త్రిపాఠిని సైతం బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక ఎట్టకేలకు టీమిండియాలోకి రాహుల్ త్రిపాఠి అడుగుపెడుతుండడంతో అతని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. #rahutripathi హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
నెట్టింటా ఫ్యాన్స్ ఖుషీ
ఇక రాహుల్ త్రిపాఠి ఎట్టకేలకు టీమిండియాకు ఎంపిక కావడం పట్ల ఓ నెటిజన్ స్పందిస్తూ.. అతను ఇక అన్ క్యాప్డ్ ప్లేయర్ కాదు. టీమిండియా కోసం అత్యంత ఎదురుచూసిన, ఎంపికకాదగ్గ ప్లేయర్ అంటూ కొనియాడాడు. ఇక మా అందరిని గర్వించేలా నీ ఆటను చూపించు అంటూ పేర్కొన్నాడు. అలాగే మరో నెటిజన్ స్పందిస్తూ.. సెలెక్టర్లు నిన్ను ఎప్పటికీ డ్రాప్ చేయకుండా నీదైన స్టైల్లో ఓ ఇన్నింగ్స్ ఆడి చూపించాలి రాహుల్.. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ పేర్కొన్నాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సైతం రాహుల్ త్రిపాఠి ఎంపికవ్వడం పట్ల ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
సన్ రైజర్స్ కీ ప్లేయర్‌గా
త్రిపాఠి ఐపీఎల్ 2022లో అద్భుతంగా రాణించాడు. త్రిపాఠి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాడిగా మారాడు. ఈ ఐపీఎల్ 2022లో అత్యంత స్థిరమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా రాణించాడు. అతను 14 మ్యాచ్‌లలో 37.55సగటుతో 413పరుగులు చేశాడు. అలాగే 158స్ట్రైక్ రేట్‌తో తన బ్యాటింగ్ పదును చూపించాడు. అతని పరుగులలో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ సీజన్‌లోనే కాదు.. త్రిపాఠి ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో కూడా నిలకడగా రాణిస్తున్నాడు.
ఐర్లాండ్ పర్యటనకు ఎంపికైన టీమిండియా టీ20 జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications