Rahul Tewatia emotional tweet : ఎన్నెన్నో అనుకున్నా కానీ ఇప్పుడు బాధేస్తుంది, ఏడుపొస్తుంది..!

జూన్ 26న ఐర్లాండ్‌లోని మలాహిడ్‌లో ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వైస్ కెప్టెన్‌గా బీసీసీఐ పేర్కొంది. అలాగే దక్షిణాఫ్రికా సిరీస్‌కు మిస్సయిన సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ సైతం జట్టులోకి ఈ సిరీస్ ద్వారా అడుగిడనున్నారు.
ఇక ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున రాణించిన రాహుల్ త్రిపాఠి సైతం తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఇకపోతే బీసీసీఐ సెలక్షన్‌లో ప్రధానంగా మిస్సయిన ప్లేయర్లు శిఖర్ ధావన్, పృథ్వీషా, రాహుల్ తెవాతీయా. ఇక పృథ్వీషాను ఎంపిక చేయకపోవడంతో ఇప్పటికే ట్విట్టరులో #shah హ్యాష్ ట్యాగ్ ద్వారా నెటిజన్లు బీసీసీఐ సెలక్షన్ పట్ల విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

చాలా ఊహించుకున్నాడు
ఇక శిఖర్ ధావన్ కాస్త వయస్సు ఎక్కువగా ఉంది కాబట్టి సెలక్ట్ చేయలదనేది ఒక సాకుగానైనా చెప్పుకోవచ్చు. కానీ ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఫినిషింగ్లో విశేషంగా రాణించిన ప్లేయర్ రాహుల్ తెవాతీయాను మాత్రం బీసీసీఐ కనీసం కన్సిడర్ చేయలేదు. ఇక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లబోయే టీంను ప్రకటించిన అనంతరం రాహుల్ తెవాతీయా చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతుంది.
ఎక్స్ పెక్టేషన్స్ హర్ట్స్ (అంచనాలు బాధిస్తాయి) అంటూ స్యాడ్ ఎమోజీలను రాహుల్ పోస్ట్ చేశాడు. ఇక తెవాతీయా నేరుగా బీసీసీఐ సెలక్షన్ గురించి ప్రస్తావించకున్నా.. ఈ ట్వీట్ అర్థం మాత్రం తనను టీమిండియాకు ఎంపిక చేయాలేదనే నిరాశ. ఇండియాకు సెలెక్ట్ అవుతానని రాహుల్ చాలా ఊహించుకున్నాడని ఈ ట్వీట్ ద్వారా అర్థమవుతుంది.
కానీ అతన్ని బీసీసీఐ పట్టించుకోకపోవడంతో చాలా ఫీలయినట్టున్నాడు. చివర్లో ఏడుపుగొట్టు ఏమోజీలను కూడా అతను పోస్ట్ చేయడం బట్టి దు:ఖానికి గురైనట్లు అర్థమవుతుంది. ఏదేమైనా తెవాతీయా టీమిండియాకు ఎంపిక కావాలంటే ఇంకాస్త టైం పట్టడం ఖాయం.

ఆల్రౌండర్ అయినప్పటికీ..
ఇక రాహుల్ తెవాతీయా మంచి ఆల్రౌండర్ అయినప్పటికీ అతను ఈ ఐపీఎల్లో పెద్దగా బౌలింగ్ చేయలేదు. రెండు, మూడు మ్యాచ్‌లు తన ఫినిషింగ్‌తో తెవాతీయా గెలిపించాడు. ఇక టీమిండియాలో ఫినిషర్లు ఇప్పటికే ఉండడంతో తెవాతీయాను బీసీసీఐ పట్టించుకోలేదని వాదన వినిపిస్తుంది. ఇక తెవాతీయాను ఎంపిక చేయకపోవడం పట్ల నెటిజన్లు మిశ్రమంగా కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియాకు సెలెక్ట్ కావాలంటే ఇంకొన్నాళ్లు నువ్వు కష్టపడాలంటూ కొందరు పేర్కొంటుండగా.. సెలక్షన్ జట్టు అవసరాలకు అనుగుణంగా జరుగుతుంది కానీ.. హిట్టింగ్ చేసినంత మాత్రాన కాదని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు బెట్టరు లక్ నెక్ట్స్ టైం అంటూ సానుభూతి కామెంట్లు చేస్తున్నారు.

ఐర్లాండ్‌లో పర్యటించే భారత జట్టు
హార్ధిక్ పాండ్యా ( కెప్టెన్ ), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతు రాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, యజ్వేంద్ర చాహాల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications